728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 16, 2020

వైఎస్సార్ అన్న‌దానం పేరుతో వ‌ల‌స కూలీల‌కు భోజ‌న పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం

చిలకలూరిపేట: కోవిడ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ప‌డింది వ‌ల‌స కూలీల‌పైనే అని, వీరి క‌ష్టాలు తీర్చ‌డాన్ని ఇప్పుడు త‌మ ప్ర‌భుత్వం ప్ర‌థ‌మ ప్రాధాన్యంగా పెట్టుకుంద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లం బొప్పూడి ఆంజ‌నేయ స్వామి గుడి స‌మీపంలో దాదాపు 300 మంది వ‌ల‌స‌కూలీల‌ను అధికారులు నిలిపేశారు. వారికి వైద్య ప‌రీక్ష‌లు చేస్తున్నారు. రెండు రోజుల్లో వారిని వారి వారి స్వ‌స్థ‌లాల‌కు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. అయితే వారికి భోజ‌నం, వ‌స‌తి విష‌యంలో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతున్నాయ‌ని ఎమ్మెల్యే దృష్టికి రాగా.. శ‌నివారం వారి వద్ద‌కు శాస‌న‌స‌భ్యురాలు వెళ్లారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ అన్న‌దానం పేరుతో వ‌ల‌స కూలీల‌కు తాను భోజ‌నం అంద‌జేస్తాన‌ని చెప్పారు. వ‌ల‌స కూలీల స‌మ‌స్య తీరే వ‌ర‌కు రోజూ ఎంత‌మందికైనా తాను భోజ‌నం పంపుతాన‌ని తెలిపారు. జాతీయ‌ర‌హ‌దారివెంబ‌డి భోజ‌న ఏర్పాట్లు చూస్తామ‌న్నారు. వ‌ల‌స కూలీల‌ను వారి స్వ‌స్థ‌లాల‌కు పంపే విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన వైఖ‌రితో ఉంద‌న్నారు. వారికి రూ.500 ఖ‌ర్చుల‌కు ఇచ్చి మ‌రి పంపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. బ‌య‌టి నుంచి వ‌చ్చే వ‌ల‌స కూలీల‌కు అన్ని వైద్య‌ప‌రీక్ష‌లు చేశాకే స్వ‌స్థ‌లాల‌కు అనుమతిస్తున్నామ‌న్నారు.
హిందీలో మాట్లాడిన ఎమ్మెల్యే*
ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని వ‌ల‌స‌కూలీల‌తో వారి భాష‌లోనే ముచ్చ‌టించారు. వ‌ల‌స కూలీలు మాట్లాడుతూ తామంతా చెన్నై నుంచి వ‌స్తున్నామ‌న్నారు. 5,6 రాష్ట్రాల‌కు చెందిన వారం ఉన్నామ‌ని తెలిపారు. కోవిడ్ వ‌ల్ల తామంతా ఉపాధి కోల్పోయామ‌ని, ఎలా బ‌త‌కాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నామ‌ని చెప్పారు. త‌మ సొంత ప్రాంతాల‌కు పంపితే ఎలాగోలా బ‌తుకుతామ‌ని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి స‌మ‌యాల్లోనే దృఢంగా ఉండాల‌ని చెప్పారు. ఎవ‌రూ కుంగిపోవ‌ద్ద‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం వ‌ల‌స కూలీల విష‌యంలో ఎంతో సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తెలిపారు. మీ అంద‌రినీ స్వ‌స్థలాల‌కు చేర్చే బాధ్య‌త‌ను మేం తీసుకుంటామ‌న్నారు. ఒక రెండు రోజులు ఓపిక‌ప‌ట్టాల‌ని, ఆ త‌ర్వాత ప్ర‌త్యేక రైళ్ల ద్వారా మిమ్మ‌ల్ని త‌ర‌లిస్తామ‌ని చెప్పారు. అప్ప‌టివ‌ర‌కు ఏ ఇబ్బంది లేకుండా తాను చూసుకుంటాన‌న్నారు. రోజూ అంద‌రికీ భోజ‌నాలు, అల్పాహారం తాను అంద‌జేస్తాన‌న్నారు. వ‌స‌తి స‌దుపాయాలు కూడా అధికారులు చూస్తార‌ని తెలిపారు.ప‌సిపాప‌ల త‌ల్లిదండ్రుల‌కు ఆర్థిక సాయం.ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఉన్న ప‌సిపాప‌ల త‌ల్లిదండ్రుల‌కు ఎమ్మెల్యే ఆర్థిక సాయం అంద‌జేశారు. చిన్నారుల‌కు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వైఎస్సార్ అన్న‌దానం పేరుతో వ‌ల‌స కూలీల‌కు భోజ‌న పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం Rating: 5 Reviewed By: NEWS UPDATE