కంటైన్మెంట్ జోన్ విషయంలో ప్రజాప్రతినిధుల పై దుష్ప్రచారం చేయవద్దు అని ఆర్యవైశ్య ప్రముఖులు తెలిపారు.
🔹కంటైన్మెంట్ జోన్ కు ప్రజాప్రతినిధికి ఎటువంటి సంబంధం లేదని కొంతమంది కావాలనే ప్రజా ప్రతినిధి పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్యవైశ్య ప్రముఖులు, వర్తక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు.
🔹పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో వారు మాట్లాడుతూ కావాలనే కొందరు ఎమ్మెల్యే పై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారని, నియోజకవర్గంలో లాక్ డౌన్ నుండి ప్రజలను ఎమ్మెల్యే ఆదుకుంటున్న విషయం తెలియదా అన్నారు.
🔹కొంత మంది ఎమ్మెల్యే పై దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని, ఇటువంటి విషయాలు మానుకోవాలని వారు హితవు పలికారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కూనల వెంకట సుబ్రహ్మణ్యం, ఆర్య వైశ్య ప్రముఖులు కే శ్రీనివాసరావు(గోల్డ్) పొట్టిశ్రీరాములు మాస్టారు, పెన్నా సాంబశివరావు, కిరణ్,గ్రంధి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
