అనంతపురం జిల్లా: రాయదుర్గం పట్టణంలోని కిరాణా దుకాణాల పై తూనికలు కొలతల అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఆన్లైన్ ఫిర్యాదు మేరకు స్పందించి దాడులు నిర్వహించారు. కిరాణా వ్యాపారస్తులు నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో విజయవాడ కు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన తూనికలు కొలతల అధికారులు పట్టణంలోని కిరాణా దుకాణాల తో పాటు చౌక ధాన్యపు డిపోల పై దాడులు నిర్వహించి తనిఖీలు నిర్వహించారు. నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తున్న 10 షాపులపై కేసు నమోదు చేసి అపరాధ రుసుం వసూలు. అదేవిధంగా పట్టణంలోని కొలిమి వీధిలోని చౌక ధాన్యపు డిపో 11లో లో కూడా దాడులు నిర్వహించి తనిఖీలు నిర్వహించారు. 30 కేజీల బియ్యాన్ని కోలవగా ఐదు కేజీల బియ్యం తక్కువ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. చౌక ధాన్యపు డిపోల ప్రజలకు పంపిణీ చేసే నిత్యావసర సరుకులు కోతులు విధిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తూనికల కొలతల అధికారులు హెచ్చరించారు.
May 18, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రాయదుర్గంలో తూనికలు కొలతల అధికారులు దాడులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

