విశాఖపట్నం:
ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్‌ను చూసి.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి
★ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఉన్న డాక్టర్ సుధాకర్‌ను కుటుంబ సభ్యులు పరామర్శించారు.
★ సుధాకర్ పరిస్ధితిని చూసి తల్లి కావేరిబాయి తల్లడిల్లారు.
★ కష్టపడి డాక్టర్‌ను చేశానని, 25 ఏళ్ల సర్వీస్ అందించాడని తెలిపారు.
★ మాస్కులు అడిగినందుకు సస్పెండ్ చేశారని మండిపడ్డారు. అది నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
★ ఉద్యోగం నుంచి సస్పెండ్ ఎలా చేస్తారన్నారు. తన బిడ్డ తనకు మామూలు మనిషిగా కావాలని డిమాండ్ చేశారు. తనకు ప్రాణరక్షణ లేదని భయపడుతున్నాడని..
★ పిచ్చివాడిగా ముద్రవేసి తన బిడ్డ జీవితాన్ని నాశనం చేయొద్దన్నారు.
★ ప్రైవేట్ ఆసుపత్రిలో తాము సొంతడబ్బులతో చికిత్స చేయించుకుంటామన్నారు.
సుధాకర్ భార్య మంజరి మాట్లాడుతూ..
★ తన భర్త సస్పెండైన నాటి నుంచి మనోవేదనకు గురయ్యారన్నారు.
★ ఉద్యోగం పోయినందుకు మరింత కుంగిపోయారని తెలిపారు.
కుమారుడు జతిన్ మాట్లాడుతూ..
★ తన తండ్రి మానసికంగా దెబ్బతినడానికి కారణం ప్రభుత్వమేనని.. మళ్లీ ఆరోగ్యంతో తిరిగి వచ్చి వైద్యుడుగా సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
★ ఆయనకు జరిగిన అన్యాయం మరే వైద్యుడికి జరగకూడదన్నారు.