కర్ణాటక:
లాక్‌డౌన్ వేళ కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
★ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు ఈ నెలాఖరు వరకు కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించిన వేళ కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
★ మే 31 వరకు నాలుగు రాష్ట్రాల నుంచి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని స్పష్టంచేసింది.
★ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ నుంచి తమ రాష్ట్రానికి ప్రయాణికుల రాకను నిరాకరిస్తామని తెలిపింది.
★ ఇప్పటివరకు కర్ణాటకలో 1231 కేసులు నమోదు కాగా.. సుమారు 30మంది ప్రాణాలు కోల్పోయారు.
★ ఈ నేపథ్యంలో సోమవారం మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం యడియూరప్ప ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..
★ రెడ్ జోన్లు, కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ రైళ్లు, ప్రభుత్వ బస్సుల సర్వీసుల్ని పునరుద్ధరించనున్నట్టు తెలిపారు.
★ బస్సుల్లో 30 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామన్నారు. అలాగే, ఓలా, ఉబేర్ క్యాబ్ సర్వీసులు కూడా రేపట్నుంచి అందుబాటులోకి రానున్నాయన్నారు.
★ రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సమన్వయం చేసుకోవాలని కేంద్రం స్పష్టంచేసిన నేపథ్యంలో కర్ణాటక సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
★ ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్
ఆదివారాల్లో మాత్రం కర్ణాటకలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ్ తెలిపారు.
★ ఆ రోజు మాత్రం కేవలం నిత్యావసరాలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు.
★ రేపటి నుంచి పార్కులు తెరుచుకుంటాయని పేర్కొన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తామని చెప్పారు.
★ కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా చోట్ల దుకాణాలన్నీ తెరుచుకుంటాయని తెలిపారు.
★ మాల్స్, విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మాత్రం మూసే ఉంటాయని పేర్కొన్నారు.