గుంటూరు జిల్లా: కొండవీడు లో ప్రభుత్వ భూముల పరిశీలన.ప్రభుత్వ విడిదిశాల, ఫుడ్‌కోర్టు, కొండవీడు సాంస్కృతిక వేదిక, విద్యత్‌సబ్‌స్టేషన్ నిర్మాణాల కోసం భూముల అన్వేషణ కొండవీడు చారిత్రక పేజీల్లో తనకూ స్థానం పొందాలని ఉందని, కోటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి తమ ప్రభుత్వ ప్రతిష్టను మరింతగా ముందుకు తీసుకుపోతామని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. కొండవీడు అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొండ దిగువన ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఫుడ్ కోర్టు, కొండవీడు సాంస్కృతిక వేదిక, ప్రభుత్వ విడిదిశాల, విద్యత్‌సబ్‌స్టేషన్ తదితరాల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములను సోమవారం ఎమ్మెల్యే విడదల రజిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండవీడులో కనీసం రూ.100 కోట్లు విలువైన పనులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. బోయపాలెం నుంచి కొండవీడుకు రూ.24 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు త్వరలోనే మొదలవుతాయని చెప్పారు. ఇప్పటికే సంబంధిత నిధులకు పరిపాలనా అనుమతులు కూడా వచ్చాయన్నారు. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివని తెలిపారు.సబ్‌స్టేషన్‌కు రూ.3.5కోట్లు.
కొండవీడులో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి రూ.3.5 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రభుత్వ భూములు పరిశీలిస్తున్నామని, అనుకూలంగా ఉన్న చోట అతి త్వరలో శంకుస్థాపన చేస్తామని వివరించారు. కొండపై పలు అభివృద్ధి పనుల కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు, ఆర్అండ్‌బీ రూ.11 కోట్లకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపాయని చెప్పారు. పర్యాటక, దేవాదాయశాఖ ఆధ్వర్యంలోనూ పనులు కొనసాగుతాయని తెలిపారు. రెండేళ్లలో కొండవీడు స్వరూపం మారుతుందన్నారు. ప్రభుత్వం అతిథి గృహాన్ని నిర్మించేలా చూస్తామన్నారు. కొండ దిగువన ఘాట్ రోడ్డు ప్రారంభమయ్యేచోట ఫుడ్‌కోర్టు, కాంప్లెక్స్, కొండవీడు సాంస్కృతిక వేదిక తదితరాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం కొండవీడును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు తాను నిరంతరం ముఖ్యమంత్రి, మంత్రులతో మంతనాలు జరుపుతూనే ఉన్నానని చెప్పారు. అధికారులతో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి, యడ్లపాడు తహశీల్దార్ సుజాత, ఎలక్ట్రికల్ ఏడీఈ చేజర్ల రాంబొట్లు, రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులు, పాల్గొన్నారు