గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో పర్యటించిన హోంమంత్రి మేకతోటి సుచరిత.కాకుమాను మండలంలోని అక్కుల చెరువును పరిశీలించిన హోంమంత్రి.చెరువు ఆధునీకరణ గురించి ఆరా తీసిన హోంమంత్రి సుచరిత.ఏళ్ళు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంపై ప్రశ్నించిన మంత్రి.నిర్లక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోమ్ మినిస్టర్.అక్కుల చెరువు అభివృద్ధి నిధులు భారీగా నిరుపయోగంగా అయ్యాయన్న హోంమంత్రి.ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం నెరవేరకుండా పోతోందని అసహనం వ్యక్తం చేసిన సుచరిత.అక్కుల చెరువును నింపడానికి కావాల్సిన గ్రావిటీ పైప్ లైన్ పనులు, గ్రామాలకు నీరు పంపించే పనులు ఏ మాత్రం జరగలేదన్న మంత్రి.దాదాపు 12 గ్రామాలకు త్రాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసాము.కానీ ఏ ఒక్క గ్రామానికి కూడా నీరు అందిన దాఖలాలు లేవని తెలిపిన హోంమంత్రి.ప్రాజెక్టు అవకతవకలపై విజులెన్స్ కమిటీ ఏర్పాటు చేస్తామన్న మంత్రి.త్వరలోనే ప్రాజెక్టు పనులన్నీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన హోంమంత్రి సుచరిత.
May 16, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో పర్యటించిన హోంమంత్రి మేకతోటి సుచరిత
Rating: 5
Reviewed By: NEWS UPDATE

