గుంటూరు జిల్లా: సేవా సంస్థ ఏ ఎం జి ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట ప్రాంతంలోని వివిధ సంఘాల చెందిన పాస్టర్లకు బియ్యం, 14 రకాల నిత్యావసరాలు, కూరగాయలను శనివారం పంపిణీ చేశారు. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ వలన ఆయా సంఘాలకు చెందిన పాస్టర్ లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఏఎంజి సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతి ఆదేశాల మేరకు సుమారు మూడు వందల మంది పాస్టర్లకు ఈ సాయాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్ సులక్షన్ ,సి ఏ ఓ మాశిలామణి, సి పి ఓ బి కృపారావు, ఇవాంజిలికల్ మేనేజర్ బి జాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు
May 16, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఏ.ఎం.జీ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

