728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 23, 2020

లాక్‌డౌన్‌వేళ‌...చిలకలూరిపేట ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సీఐ

చిలకలూరిపేట:
🔹మీరంతా ఇళ్ల‌లోనే ఉండండి.. అధికారులు మాత్ర‌మే మీ ర‌క్ష‌ణ కోసం బ‌య‌ట ఉంటారు. ఇది లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప‌దే ప‌దే చెబుతున్న హెచ్చ‌రిక‌లు. ఇవి ప్రజ‌లు పాటించారో .. పాటిస్తున్నారో లేదో తెలియ‌దు గాని ప్ర‌భుత్వ ప‌రంగా ఆదేశాల‌ను తూచ త‌ప్ప‌కుండా ఫాలో అయిన వ్య‌క్తి మాత్రం అర్బ‌న్ సీఐ వి సూర్య‌నారాయ‌ణ. క‌నిపించ‌ని శ‌త్రువుతో ఒక‌వైపు యుద్దం చేస్తునే ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌చెబుతూ, అవ‌గాహ‌న క‌ల్పిస్తూ చిల‌క‌లూరిపేట‌లో ఆయ‌న పోషించిన పాత్ర అద్వితీయం.

🔹నేడు చిల‌క‌లూరిపేట‌లో మ‌రో క‌రోనా కేసు వ్యాప్తి చెంద‌కుండా చేప‌ట్టిన చ‌ర్య‌లు స‌త్ప‌లితాలు ఇచ్చాయి.
క‌రోనా గురించి అప్ప‌టికి చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు తెలియ‌దు. ఎక్క‌డో ఏదో కేసులు న‌మోదు అవుతున్నాయ‌ట‌.. క‌రోనా ఇలా సోకుతుండ‌ట‌. .. ఇలా ప్ర‌జ‌లు చ‌ర్చించుకొనే వారు. క్వారెంటైన్‌, ఐసోలేష‌న్ ఈ ప‌దాలు కూడా ప్ర‌జ‌ల‌కు తెలియ‌వు.

🔹ఈ క్ర‌మంలోనే క‌రోనా సంబంధించిన పూర్తి స‌మాచారం అధ్య య‌నం చేయ‌టం, ప్ర‌జ‌లను అప్ర‌మ‌త్తం చేయ‌టానికి సీఐ సంసిద్ద‌మ‌య్యారు. ఇదే క్ర‌మంలోనే విదేశం నుంచి వ‌చ్చిన వ్య‌క్తిని ప‌రీక్ష చేయించ‌టంతో పాటు తీసుకోవ‌ల్సిన జాగ్ర‌త్త‌లు చేప‌ట్టారు. అత‌నిని ఇంటికే ప‌రిమితం చేశారు. దీంతో  పాటు అత‌ను ఎవ‌రిని క‌లిసారు...ఆయ‌న ప్రైమ‌రీ కాంట్ర‌క్ట్‌ల స‌మాచారం ఇలా ప్ర‌తి విష‌యాన్ని అధ్య‌యం చేశారు. ఒక వేళ పాజిటివ్ రిపోర్టులు వ‌స్తే ఎలా స్పందించాలి.. అనే విష‌యంపై కూడా నిత్యం ఉన్న‌తాధికారుల‌తో సంప్ర‌దించేవారు. అయితే నెగిటివ్ రిపోర్టు రావ‌టంతో ఈ స‌మ‌స్య స‌మ‌సిపోయింది.

🔹అనంత‌రం యువ‌వైద్యురాలికి క‌రోనా సోకింద‌న్న స‌మాచారంతో ఎప్ప‌టిక‌ప్పుడు సీఐ సూర్య‌నారాయ‌ణ అప్ర‌మ‌త్తం అయ్యారు. యుద్ద ప్రాతిప‌దిక‌న ప్ర‌జ‌ల రాక‌పోక‌లు నిషేదించారు. అన్నింటిక‌న్నా లాక్‌డౌన్లో  సీఐ వ్య‌వ‌హ‌రించిన తీరు పేట ప్ర‌జ‌లకు ఎప్ప‌టికి మ‌ర‌చిపోలేరు. రోడ్ల‌పై వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌చెబుతూ, మ‌రోవైపు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తూ లాక్‌డౌన్ ను స‌మ‌ర్ధ‌వంతంగా అమలు అయ్యేలా చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యం ప్ర‌తి రోజూ తెల్ల‌వారు జాము ఉద‌యం 5గంట‌ల కే రోడ్డుపైకి రావ‌టం, త‌న సిబ్బందితో, ఇత‌ర అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొవ‌టం ఆయ‌న నిత్య‌కృత్యాల్లో ఒక‌టిగా మారింది.

🔹ఏదో చేస్తున్నామ‌ని ప్ర‌జ‌ల‌ను, అధికారుల‌ను న‌మ్మించాల‌ని చూడ‌టంవేరు. ఎవ‌రితో ప్ర‌యేమం లేకుండా ఉన్న‌తాధికారుల ఆదేశాల‌ను పాటిస్తూ నిబ‌ద్ద‌త‌గా విధులు నిర్వ‌హించ‌టం వేరు. ఇక్క‌డ సీఐ సూర్య‌నారాయ‌ణ రెండో కోవ‌కు చెందుతారు. 

🔹ప్ర‌చార అర్బాట‌ల‌కు పోకుండా ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం, ఆరోగ్య ప‌రిరక్ష‌ణ కోసం  నిలుస్తున్న ఆయ‌న పేట ప్ర‌జ‌ల మ‌న‌స్సులో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. అధికారి అంటే కింద సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఏసీ రూముల్లో రెస్టు తీస‌కోవ‌టం కాద‌ని, వారిలో ఒక‌రిగా మెలిగి
విధులు నిర్వ‌హించ‌ట‌మే అని సీఐ సూర్య‌నారాయ‌ణ ఇలా చాటి చెప్పారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: లాక్‌డౌన్‌వేళ‌...చిలకలూరిపేట ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సీఐ Rating: 5 Reviewed By: NEWS UPDATE