728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 29, 2020

మహానాడు కాదది.. మాయ నాడు.. టిడిపి పై విరుచుకుపడిన ఎమ్మెల్యే రజిని

చిలకలూరిపేట: తాను అధికారంలో ఉన్న‌న్నాళ్లూ బీసీల‌ను అణ‌గదొక్కిన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు ఇప్పుడు మొస‌లి క‌న్నీళ్లు కారుస్తున్నార‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని ఎద్దేవాచేశారు. స్థానిక త‌న కార్యాల‌యంలో శుక్ర‌వారం ఆమె విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చుని బీసీల‌కు తీర‌ని ద్రోహం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ హ‌యాంలో 2014 నుంచి 2018 ర‌కు వెనుక‌బ‌డిన కుల‌వృత్తుల స‌మాఖ్య‌ల కోసం రూ.919.97 కోట్లు కేటాయించార‌ని, అయితే ఇందులో కేవ‌లం రూ.139.35 కోట్లు అంటే కేవ‌లం 15.14 శాతం మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ ఇచ్చిన హామీ మేర‌కు 2014 నుంచి 2019 మార్చి వ‌ర‌కు బీసీల సంక్షేమం కోసం టీడీపీ ప్ర‌భుత్వం బీసీ స‌బ్ ప్లాన్ పేరుతో ఏటా రూ.10వేల చొప్పున ఐదేళ్ల‌కు క‌లిపి రూ.50 వేల కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంద‌ని కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంద‌ని, ఐతే కేవ‌లం 12వేల కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసి చేతులు దులుపుకున్నార‌ని మండిప‌డ్డారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ మేనిఫెస్టోలో బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం 120 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వ‌చ్చాక ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌ని విల‌న్ సీఎంగా చంద్ర‌బాబు మిగిలిపోయార‌ని దుయ్య‌బ్టారు. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ బీసీల‌కు నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వ‌లేద‌ని, పారిశ్రామిక‌వేత్త‌లు, కార్పొరేటర్లు మాత్ర‌మే ఈ భాగ్యానికి నోచుకున్నార‌ని దుమ్మెత్తిపోశారు. చేనేత కార్మికుల‌కు నిధులు కేటాయింపేగాని, ఒక్క రూపాయి కూడా మంజూరు చేయ‌ని నీచ చ‌రిత్ర చంద్ర‌బాబుద‌ని తూర్పార‌ప‌ట్టారు.

బీసీల‌కు మేలు చేస్తున్న‌ది వైఎస్సార్ కాంగ్రెస్ మాత్ర‌మే...

ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము అధికారంలోకి వ‌చ్చాక కేవ‌లం ఏడాది వ్య‌వ‌ధిలో త‌మ సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల రాష్ట్రంలో 1.78 కోట్ల మంది బీసీ లు ల‌బ్ధి పొందార‌ని తెలిపారు. బీసీల సంక్షేమం కోసం త‌మ‌ ప్ర‌భుత్వం ప‌లు ప‌థ‌కాల ద్వారానే రూ.19,298 కోట్ల రూపాయ‌ల ల‌బ్ధి అంద‌జేసింద‌ని తెలిపారు. చంద్ర‌బాబు ఐదేళ్ల‌లో క‌లిపి బీసీల‌కు ఇచ్చిన దాని కంటే చాలా ఎక్కువ మేము ఒక్క ఏడాదిలోనే బీసీల‌కు ఇచ్చామ‌ని చెప్పారు. ప్ర‌తి మ‌హానాడులో చంద్ర‌బాబునాయుడు టీడీపీ అధినేత‌ ఎన్టీఆర్ పేరును తెగ క‌ల‌వ‌రిస్తుంటార‌ని తెలిపారు. ఇది కేవ‌లం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను దారుణంగా మోసం చేయ‌డానికేన‌న్నారు. టీడీపీ అధికారంలో ఉండ‌గా ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న కోరుతూ ఎలాంటి తీర్మానాలు చేయ‌ద‌ని, కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న పంపే ఆలోచ‌నే చేయ‌ద‌ని, మ‌హానాడులో మాత్రం తీర్మానాలు చేస్తుంటార‌ని చెప్పారు. ఇది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌ట‌మేన‌ని దుయ్య‌బ‌ట్టారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాల‌ని ఇప్పుడు తీర్మానం చేయ‌డం హ‌స్యాస్పదంగా ఉంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌లుచుకుంటే అది చాలా చిన్న ప‌ని అని, అంత చిత్త‌శుద్ధే ఉంటే చంద్ర‌బాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు.

అవినీతిపై చంద్ర‌బాబు మాట్లాడ‌టం దెయ్యాలు వేదాలు వ‌ల్లించ‌డ‌మే...

మ‌హానాడులో చంద్ర‌బాబునాయుడు అవినీతి గురించి మాట్లాడుతుండ‌టం చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించిన‌ట్లే ఉంద‌ని చెప్పారు. అస‌త్యాలు ప్ర‌చారం చేయ‌డానికి పెట్టేలా ఇలాంటి మ‌హానాడుల‌కు విలువే లేద‌ని తేల్చారు. మ‌హానాడులో టీడీపీ చేసిన అవినీతి గురించి చ‌ర్చించి ఉంటే బాగుండేద‌ని హిత‌వు ప‌లికారు. శ‌్రీకాళ‌హ‌స్తిలో ఇసుక అక్రమ మైనింగ్ పై పోరాడుతున్న ప్ర‌జ‌ల‌పైకి ఏకంగా పోలీస్ స్టేష‌న్ ముందు నుంచే లారీ ఎక్కించి చంపేసింది టీడీపీ కాదా అని ప్ర‌శ్నించారు. దీని గురించి మ‌హానాడులో ఎందుకు చర్చించ‌లేద‌ని నిల‌దీశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు ఇసుక అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌వారిని అడ్డుకున్న అధికారుల‌పై ఏకంగా దాడులు చేసిన విష‌యాల‌ను అప్పుడే మ‌ర్చిపోతే ఎలా అని దుయ్య‌బ‌ట్టారు. జ‌న్మ‌భూమి క‌మిటీల ద్వారా స్వ‌యం ఉపాధి రుణాల ల‌బ్ధిదారుల నుంచి ఇళ్ల క‌ట్టుకుందామ‌ని ఆశ‌ప‌డ్డ వారి వ‌ర‌కు, పింఛ‌న్ల కోసం అర్జీలు పెట్టిన వాళ్ల‌ను కూడా వ‌ద‌ల‌కుండా లంచాలు వ‌సూలు చేసిన నీచ చ‌రిత్ర మీపార్టీది, నాయ‌కుల‌దు కాదా అని ప్ర‌శ్నించారు. ఈ విష‌యాల గురించి మ‌హానాడులో ఎందుకు చ‌ర్చించ‌లేద‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబును మించిన అబ‌ద్ధాల కోరు ఈ లోకంలో మ‌రెవ‌రూ లేర‌ని, ఈ విష‌యం ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని చెప్పారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మహానాడు కాదది.. మాయ నాడు.. టిడిపి పై విరుచుకుపడిన ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE