చిలకలూరిపేట: వైద్యులకు ప్రభుత్వం మాస్కులు, P.P.E కిట్లు అందించాలని, లేకుంటే తమ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని అడిగిన నేరానికి దళిత డాక్టర్ సుధాకర్ ను విధుల నుండి తప్పించిన ఘటన మరువక ముందే, మరోసారి చెయ్యని నేరానికి సదరు వైద్యుడి మీద రాష్ట్ర ప్రభుత్వం అరాచకానికి పాల్పడడం దురదృష్టకరమని, తక్షణమే డాక్టర్ సుధాకర్ ను విధుల్లోకి తీసుకోవాలని యావత్ దళిత జాతికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ టి.డి.పి ఎస్సీ నేతలు పార్టీ కార్యాలయంలో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్య నియంత్రణ పేరుతో కేవలం 8/- రూపాయలకు తయారు చేసే మందును 180/- రూపాయలు అమ్ముతూ పేద ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల నష్టపోతుంది కింది స్థాయి వర్గాలేనని తెలిపారు. కాబట్టి దళితుల, ఎస్టీ వర్గాలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్న మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఎక్సైజ్ మంత్రి అంటే ఎవరో తెలియదని, అలాగే జగన్ , సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల మీదకు వదిలిన పిచ్చి బ్రాండ్లను పవర్ స్టార్, టాప్ స్టార్, యంగ్ స్టార్, యూత్ స్టార్, డబల్ కిక్, కౌంట్ డౌన్ లను తాగి అనారోగ్యం పాలై వారికి వారే ఎవరో తెలియని మానసిక వ్యాధులకు గురి అవుతున్నారని తెలిపారు. ఎస్సీ నేతల 12 గంటల దీక్షను మాజీ జి.డి.సి.సి బ్యాంకు చైర్మన్ మానం వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా ప్రారంభించారు.ఈ దీక్షా శిబిరంలో ఎస్సి సెల్ టౌన్ అధ్యక్షులు లాజర్, మాజీ ఎ.పి ఎస్.సి కార్పోరేషన్ డైరెక్టర్ ఇనగంటి జగదీష్, బడుగుజాకబ్ రాజు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గేరా రాజశేఖర్, S.A.N. రాజు, జరుగుమల్లి చెన్నయ్య, చెల్లి రాంబాబు, పిల్లి కోటి, ఇనగంటి బెంజిమన్, వడియాల పుల్లారావు, కోoడెపాటి రమేష్, మధు, తదితరులు పాల్గొన్నారు.
May 20, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: దళిత డాక్టర్ పై దాడికి నిరసనగా టి.డి.పి ఎస్సీ నేతల నిరసన దీక్ష
Rating: 5
Reviewed By: NEWS UPDATE

