728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 30, 2020

చిలకలూరిపేట నోడల్ అధికారిగా ఆర్డిఓ వెంకటేశ్వరరావు

గుంటూరు జిల్లా:
🔹చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని, రూరల్ ఎస్పీ విజయరావు, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, డి ఎం హెచ్ ఓ యాస్మిన్ తదితరులు సమీక్షా సమావేశం నిర్వహించారు.

🔹ఈ సమావేశానికి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, రెవెన్యూ,పోలీస్ అధికారులు,మండల ప్రజా పరిషత్ అధికారులు,మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్:

🔹జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు, కరోనా సోకిన వ్యక్తి ని  ప్రేమతో చూడాలని వారిని ద్వేషించచవద్దని తెలియజేశారు.

🔹రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఇకమీదట కరోనాతో సహజీవనం తప్పేలాలేదని ఈ సందర్భంగా వారు  అభిప్రాయం వ్యక్తం చేశారు.  ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాను తరిమికొట్టొచ్చని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాస్కు   ఉంటే ఇటువంటి లక్షణాలు ఎదుటివారికి సోకవని ఈ సందర్భంగా వారు చెప్పారు.

🔹చేతులు శుభ్రం చేసుకోవాలని, కరోనా పాజిటివ్ ప్రాంతాల్లో మెడికల్ అధికారులు, అసిస్టెంట్లు గర్భిణులు, వృద్ధులు ,చిన్న పిల్లలకు పరీక్షలు నిర్వహించేలా అధికారులకు తగు సూచనలు చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాకు తెలియజేశారు.

ఎమ్మెల్యే విడదల రజని:

🔹చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడుతూ చిలకలూరిపేటలో అనూహ్యంగా ఐదు కేసులు నమోదైనట్లు అధికారులతో  ఎప్పటికప్పుడు తాను సమాచారం తెలుసుకొని తగు సూచనలు చేస్తున్నానని తెలిపారు. ప్రతి విషయం  జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మీడియాకు తెలియజేశారు.

🔹చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించి వలసిందిగా కోరినట్లు దీనికి కలెక్టర్ స్పందించి నర్సారావుపేట ఆర్డీవో వెంకటేశ్వరరావును నియోజకవర్గ నోడల్ అధికారి గా నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నోడల్ అధికారిగా ఆర్డిఓ వెంకటేశ్వరరావు Rating: 5 Reviewed By: NEWS UPDATE