728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 22, 2020

108 కుంభకోణాన్ని బయటపెట్టిన పట్టాభిరామ్ పై వేధింపులకు దిగడం ఏంటి?: చంద్రబాబు

అమరావతి:
★ ప్రజల ప్రాణాలను నిలబెట్టే 108 అంబులెన్స్ ల నిర్వహణ కాంట్రాక్టులో స్కామ్ జరగడం సిగ్గుచేటు.

★ గత ఒప్పందం ప్రకారం బీవీజీ సంస్థకు 2020 డిసెంబరు 12 వరకూ కాలపరిమితి ఉంటే... 15 నెలల ముందే 2019 సెప్టెంబరు 20న కొత్త ఏజెన్సీ కోసం 111 జీవో ఎందుకు తెచ్చినట్టు?

★ అంబులెన్స్ నిర్వహణ ఒప్పందం అమలులో ఉండగా 10 నెలల ముందుగానే 2020 ఫిబ్రవరి 13న జీవో 116 తో బీవీజీ సంస్థఒప్పందాన్ని ఎందుకు రద్దుచేశారు?

★ ఫైనాన్స్‌ విధానంలో కొనుగోలు చేయగలిగిన అంబులెన్సులను జీవో 117తో నేరుగా డబ్బులు చెల్లించి ఎందుకు కొన్నారు?

★ ఒక్కొక్క పాత అంబులెన్సుకు రూ.47 వేలు, కొత్త అంబులెన్సుకు రూ.90 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు పెంచి... వైసీపీ ఎంపీ అల్లుడికి చెందిన సంస్థకు ఉన్నపళంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంలో మతలబు ఏంటి?

★ అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి?

★ అంబులెన్స్ స్కామ్ వెలుగులోకి వస్తే అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం... కుంభకోణాన్ని బయటపెట్టిన తెలుగుదేశం నేత పట్టాభిరామ్ పై వేధింపులకు దిగడం ఏంటి? హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి?

★ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది తెలుగుదేశం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 108 కుంభకోణాన్ని బయటపెట్టిన పట్టాభిరామ్ పై వేధింపులకు దిగడం ఏంటి?: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE