★ కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ ధాఖలైన పిల్ పై హైకోర్టు విచారణ..
★ పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్.
★ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జర్నలిస్ట్ పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు..
★ ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్.
★ పిటీషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య..
★ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్...
★ కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరిన పిటీషనర్...
★ జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు, ఉచితంగా అందించాలని కోర్టును కోరిన పిటీషనర్..
★ న్యాయవాదులకు 25 కోట్ల కేటాయించిన ప్రభుత్వం జర్నలిస్టులను సైతం ఆదుకోవాలన్న పిటీషనర్..
★ జర్నలిస్టుల పై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్...
★ రెండు వారాల్లో ప్రభుత్వం కు జర్నలిస్టుల సమస్యలపై రెప్రజెంటేషన్ ఇవ్వాలని కోరిన హైకోర్టు...
★ రెండు వారాల్లో జర్నలిస్టుల సమర్పించిన రెప్రజెంటేషన్ పై స్పందించి వారి సమస్యలు పరిష్కారం కు చొరవ చూపాలని ప్రభుత్వం కు సూచించిన హైకోర్టు.
★ దింతో పిటీషన్ ముగించిన హైకోర్టు.

