728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 2, 2020

ఇండియా పేరు మార్చాలని పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..

న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు):
★ ఇండియా అనే పేరును భారత్‌ లేదా హిందుస్తాన్‌గా మార్చాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం జూన్ 2న విచారణ జరపనుంది.

★ ఇండియా అనే పేరును భారత్‌ లేదా హిందుస్తాన్‌గా మార్చాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది.

★ అలా చేయడం వల్ల దేశ ప్రజల్లో ఆత్మగౌరవం, జాతీయత భావం పెరుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు.

★ ఇండియా అనే పేరును మార్చి భారత్‌ లేదా హిందుస్తాన్‌గా పిలిచేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

★ ఆర్టికల్ 1లోనే దేశం పేరు, సరిహద్దులు కూడా నిర్దేశించి ఉంటాయి.

★ వాస్తవానికి ఈ పిటిషన్ శుక్రవారమే (మే 29) సుప్రీంకోర్టులో విచారణకు లిస్ట్ అయింది.

★ అయితే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్.ఏ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత లిస్ట్ నుంచి డిలీట్ చేశారు.

★ సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న నోటీసు ప్రకారం ఈ పిటిషన్ నేడు కోర్టు ముందుకు విచారణకు రానుంది.

★ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

★ భారత్ అనే పేరును హిందుస్తాన్‌గా మార్చడం వల్ల దేశ ప్రజలు గతంలో తాము మరొకరి పాలనలో ఉన్నామనే భావన నుంచి బయటపడతారని పిటిషనర్ పేర్కొన్నారు.

★ ఇంగ్లీష్ పేరును తొలగించి ఆ స్థానంలో ప్రతీకగా భావించే మరో పదం చేర్చడం వల్ల దేశ ప్రజల్లో ఆత్మగౌరవం, జాతీయతా భావం పెరుగుతుంది. ఓ రకంగా ఇండియా అనే పేరును తీసేసి అక్కడ భారత్ అనే పేరు చేర్చడం వల్ల స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని గుర్తు చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది.  అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

★ 1948 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న సమయంలోనే ఇండియా అనే పేరు స్థానంలో భారత్ లేదా హిందుస్తాన్ అనే పేరు పెట్టాలని బలంగా వాదన వినిపించిన అంశాన్ని పిటిషన్‌లో గుర్తు చేశారు.

★ ఏదేమైనా ఇప్పటికైనా పేరుమార్చాలని కోరారు..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇండియా పేరు మార్చాలని పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ.. Rating: 5 Reviewed By: NEWS UPDATE