728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 28, 2020

ఒక్క రోజులో 19,906 కేసులు.. 410 మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,906 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 410 మంది మరణించారు.
   
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,28,859కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,095కి పెరిగింది. 2,03,051 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,09,713 మంది కోలుకున్నారు.

కాగా, జూన్‌ 26 వరకు దేశంలో మొత్తం 82,27,802 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,31,095 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఒక్క రోజులో 19,906 కేసులు.. 410 మరణాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE