చిలకలూరిపేట: లాక్ డౌన్ వలన ప్రైవేట్ ఉపాధ్యాయుల మరియు అధ్యాపకుల పరిస్థితి దారుణంగా తయారైందని కొన్ని నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నారని అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జబ్బార్ అన్నారు.
ఆదివారం స్థానిక ఏలూరు సిద్దయ్య విజ్ఞాన కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం వాహన మిత్రులకు చేనేత కార్మికులకు విద్యార్థులకు అమ్మ ఒడి విద్యాదీవెన కింద సహాయం చేస్తుందని మరి విద్యాబుద్ధులు నేర్పే ప్రైవేట్ ఉపాధ్యాయుల మరియు అధ్యాపకుల గురించి పట్టించుకునే వారే లేరని అన్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సహచర ఉపాధ్యాయులు నసీర్, రఫీ, జబ్బార్, అంకమ్మరావు, రమేష్ ,సుబ్బారావు, రాఘవ, జాఫర్, సుభాని తదితరులు పాల్గొన్నారు.