728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 28, 2020

రామ్‌దేవ్‌ బాబా, పతంజలి సీఈవో పై కేసు నమోదు

రాజస్థాన్:
★ కరోనా కు మందు కని పెట్టామని, దాని ద్వారా 100 శాతం రోగం నయమవు తుందని చెప్తూ యోగా గరువు రామ్‌దేవ్‌ బాబా, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, మరో ముగ్గురి పై రాజస్థాన్‌ లో కేసు నమోదైంది.

★ వాళ్లంతా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని రాజస్థాన్‌ జైపూర్‌‌ లోని జ్యోగి నగర్‌‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఎఫ్‌ఐఆర్‌‌ నమోదు చేశారు.

★ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణ, నిమ్స్‌ చైర్మన్‌ డాక్టర్‌‌ బల్బీర్‌‌ సింగ్‌ తొమార్‌‌, డైరెక్టర్‌‌ డాక్టర్‌‌ అనురాగ్‌ తొమార్‌‌, సైంటిస్ట్‌ అనురాగ్‌ వర్షణే పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

★ బల్‌రామ్‌ జాఖర్‌‌ అనే వ్యక్తి ఈ కేసు పెట్టారన్నారు. ఐపీసీ సెక్షన్‌ 420 కింద చీటింగ్‌ కేసు పెట్టామన్నారు.

★ పతంజలి నుంచి కరోనా కు డ్రగ్‌ కని పెట్టామని, కొరోలిన్‌ పేరు తో రామ్‌దేవ్‌ బాబా డ్రగ్‌ ను రిలీజ్‌ చేశారు.

★ 100 శాతం రోగాన్ని తగ్గిస్తుందని అన్నారు.

★ అయితే ఆయుష్‌ మినిస్ట్రీ దాని పై రెస్ట్రిక్షన్స్‌ విధించింది.

★ కరోనా మందు అని ప్రచారం చేయొద్దని చెప్పింది. కాగా.. మహారాష్ట్ర, రాజస్థాన్‌ ప్రభుత్వాలు కూడా ఆ మందు ను అమ్మొద్దని, అమ్మితే చర్యలు తీసుకంటామని చెప్పాయి.

★ పర్మిషన్‌ లేకుండా క్లినికల్‌ ట్రయల్స్‌ చేసినందుకు గాను నిమ్స్‌ డైరెక్టర్‌‌ కు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రామ్‌దేవ్‌ బాబా, పతంజలి సీఈవో పై కేసు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE