728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 13, 2020

200 మందికి ఆరు లక్షల విలువ చేసే నిత్యావసరాలు అందజేసిన రామ శీను మిత్రమండలి

చిలకలూరిపేట: పట్టణంలో అనేక మంది కి రక్తదానం చేస్తూ అనేక మంది ప్రాణాలను నిలబెడుతున్న కాసా రామ శీను మిత్ర మండలి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి రక్తదాన శిబిరాలు నిర్వహించి అనేక మందికి రక్తదానం చేస్తున్న విషయం విదితమే.

ఆదివారం వరల్డ్ బ్లడ్ డే సందర్భంగా రక్తదానం ప్రారంభించి రేపటికి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శనివారం కాసా రామ శీను మిత్రమండలి ఆధ్వర్యంలో రక్తదానం చేస్తున్న వారికి, మిత్ర మండలి సభ్యులకు సుమారు 200 మందికి ఆరు లక్షల రూపాయల విలువ చేసే 50 రకాల నిత్యావసర సరుకులను చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడుదల రజిని చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ కాసా రామ శీను చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ ముందు ముందు రామ శ్రీనుకు మంచి గుర్తింపు ఇస్తామని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో రామ శ్రీను మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 200 మందికి ఆరు లక్షల విలువ చేసే నిత్యావసరాలు అందజేసిన రామ శీను మిత్రమండలి Rating: 5 Reviewed By: NEWS UPDATE