728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 5, 2020

ఏపీలో త్వరలో 3795 వీఆర్వో పోస్టుల భర్తీ

అమరావతి:
🔹ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న వేలాది వీఆర్వో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

🔹ఇప్పటివరకూ వీఆర్ఏలుగా ఉంటున్న వారిని అనుభవం, విద్యార్హతల ఆధారంగా వీఆర్వో పోస్టులకు ఎంపిక చేసేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

🔹త్వరలో జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీల భర్తీ చేపడతారు.

🔹త్వరలో వీఆర్వో పోస్టుల భర్తీ...
రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 3795 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల భర్తీకి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది.

🔹గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో భారీగా అధికారుల కొరత ఏర్పడటంతో వీఆర్వో గ్రేడ్ 2 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.

🔹అదే సమయంలో చాలా ఏళ్లుగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా (వీఆర్ఏ) పనిచేస్తున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుని మిగిలిన వీఆర్వో గ్రేడ్ 2 పోస్టులు భర్తీ చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి వచ్చాయి.

🔹వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గతంలోనే వీటి భర్తీకి ఆదేశాలు సర్కారు ఇచ్చింది.

🔹అనుభవజ్ఞులైన వీఆర్ఏలను వీఆర్వో పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా పలు జిల్లాల కలెక్టర్లు పట్టించుకోలేదు.

🔹దీంతో ప్రభుత్వానికి రెవెన్యూ సహాయకుల సంఘం తాజాగా మరోమారు ఇదే అంశంపై విజ్ఞాపనలు పంపింది.

🔹వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా కలెక్టర్లకు ఈ పోస్టుల భర్తీపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు కూడా పంపారు.

🔹దీంతో వీటి భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

వీఆర్వో పోస్టులకు అర్హతలివే...

🔹రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటున్న 3795 వీఆర్వో పో్స్టుల భర్తీకి కచ్చితంగా ఇంటర్ లేదా దానికి సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలి.

🔹ఇంటర్ చదవకుండా నేరుగా డిగ్రీ, పీజీ చదివిన వారికి కూడా అవకాశం కల్పిస్తారు.

🔹ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి వీఆర్ఏలుగా ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి.

🔹ఉద్యోగంలో చేరిన తర్వాత కోర్సు పూర్తి చేసి ఉంటే అందుకు ముందస్తు అనుమతి తీసుకుని ఉండాలి.

🔹ఆయా అర్హతల ఆధారంగా సర్టిఫికెట్ల పరిశీలన చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.

🔹అలాగే వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేసేందుకు వన్ టైమ్ సర్వీస్ రూల్స్ నిబంధన అమలు చేస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో త్వరలో 3795 వీఆర్వో పోస్టుల భర్తీ Rating: 5 Reviewed By: NEWS UPDATE