728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 5, 2020

తిరుమల శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి తితిదే మార్గదర్శకాలను విడుదల చేసింది. శుక్రవారం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తితిదే ఛైర్మన్‌  వై.వి.సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. ఈనెల 8 నుంచి తితిదే ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న లడ్డూల విక్రయం ఈనెల 8 నుంచి నిలిపివేస్తున్నట్టు చెప్పారు.

🔹ఈనెల 8, 9న కొంత మంది గుర్తింపు పొందిన తితిదే ఉద్యోగులకు స్వామివారి దర్శనం.
🔹10న స్థానిక భక్తులకు   అనుమతి
🔹11 నుంచి దేశ వ్యాప్తంగా వచ్చే భక్తులకు అనుమతి.
🔹రోజూ సుమారు 3వేల ఆన్‌లైన్‌ టికెట్లు అందుబాటులోకి.
🔹కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు తిరుమలకు రావొద్దు.
🔹ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేసుకున్న వారికి అలిపిరిలో పరీక్షలు
🔹65 ఏళ్లు పైబడిన వారు, పిల్లలకు అనుమతి నిరాకరణ
🔹మాస్క్‌లు తప్పనిసరి, భౌతికదూరం పాటించాలి.
🔹ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి.
🔹ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అలిపిరి నడకదారిలో భక్తులకు అనుమతి.
🔹వసతి గదుల్లో రెండో రోజు కొనసాగేందుకు అనుమతి ఉండదు.
🔹వసతి గదిలో ఇద్దరికి మాత్రమే అనుమతి.
🔹క్యూలైన్లను ప్రతి రెండు గంటలకోసారి శానిటైజ్‌ చేస్తారు.
🔹శ్రీవారి ఆలయంలోని ఉపాలయాల దర్శనం ఉండదు.
🔹వైరస్‌ ప్రబలే అవకాశం ఉన్నందున శఠారి, తీర్థం ఇవ్వరు.
🔹శ్రీవారి పుష్కరిణిలో స్నానాలకు భక్తులను అనుమతించరు.
🔹ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నా... వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతి.
🔹శ్రీవారి హుండీ వద్దకు వెళ్లే వారికి హెర్బల్‌ శానిటైజేషన్‌ ప్రక్రియ.
🔹శ్రీవారి హుండీలో కానుకలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
🔹తిరుమలలో ప్రైవేటు హోటళ్లకు అనుమతి  నిరాకరణ.
🔹శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొన్నాళ్ల పాటు అనుమతి ఉండదు.
🔹11 నుంచి ఉదయం 6.30 నుంచి 7.30 వరకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనాలు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: తిరుమల శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE