దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా దాదాపు 10వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. భారత్‌లో కరోనా వైరస్ బయటపడిన తర్వాత మొట్టమొదటిసారిగా 24గంటల్లో 9851 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో కొవిడ్-19 బారినపడ్డ వారిసంఖ్య 2,26,770కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా దేశంలో ప్రతి రోజు 200పైగా కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన 24గంటల్లో దేశంలో అత్యధికంగా 273మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కొవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 6348కి చేరింది. దేశంలో కరోనా వైరస్ సోకిన వారిలో ఇప్పటివరకు 1,09,462 మంది కోలుకోగా మరో 1,10,960 మంది చికిత్స పొందుతున్నారు.
ప్రపంచంలో కొవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ 7స్థానంలో ఉంది. దాదాపు 2లక్షల 34వేల కేసులతో ఇటలీ ఆరవ స్థానంలో ఉండగా..లక్షా 84వేల కేసులతో జర్మనీ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి. కరోనా మరణాల్లో మాత్రం భారత్ ప్రపంచంలో 12స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం కెనడా 7637మరణాలతో 11స్థానంలో ఉండగా.. 5990మరణాలతో నెదర్లాండ్ 13స్థానంలో కొనసాగుతున్నాయి.