తిరువనంతపురం: కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గర్భిణి ఏనుగు మృతి ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జంతువుల పట్ల అమానుష ప్రవర్తనపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. తాజాగా ఆ ఏనుగు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక బయటకు వచ్చింది. పేలుడుపదార్థాలు కలిగిన పైనాపిల్ తినడం వల్లే నోటిలో తీవ్ర గాయాలయ్యాయని తేలింది. ఈ క్రమంలోనే అది నొప్పిని భరిస్తూ 14 రోజుల పాటు ఏమీ తినకుండా, తాగకుండా ఆకలితో అలమటించిందని నివేదికలో పేర్కొన్నారు. ‘అలా ఒకరోజు మొత్తం నదిలో ఉండి, చివరకు నీరసించి అక్కడే నీటిలో పడి పోయింది. ఊపిరి తిత్తుల వైఫల్యమే ఏనుగు మృతికి కారణం’’ అని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు.
ఏనుగు మృతికి సంబంధించిన ఫొటోలు ఓ అటవీశాఖ అధికారి తొలుత ఫేస్‌బుక్‌లో పోస్టుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్పందించిన కేరళ వణ్యప్రాణి సంరక్షణ అధికారి సురేంద్ర కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 23న ఆ ఏనుగును స్థానికులు గుర్తించారని, తర్వాత అది అడవిలోకి వెళ్లి.. మళ్లీ 25న తిరిగొచ్చిందని చెప్పారు. అది చనిపోయే ముందు ఒక రోజు మొత్తం వెల్లియార్ నదిలోనే ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ఎవరో కావాలని... పైనాపిల్‌లో పేలుడు పదార్ధాలు పెట్టి ఏనుగుకు తినిపించడం కష్టమని ఆయన సందేహం వెలిబుచ్చారు. అడవి ఏనుగుల వద్దకు వెళ్లడానికి ఎవరూ సాహసించరని తెలిపారు.