గుంటూరు: ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో అనేక రకాల వెబ్సైట్లు ఆన్ లైన్ రమ్మీ ద్వారా వేలాది రూపాయలు సంపాదించవచ్చని మభ్యపెడుతూ యువతను మోసం చేస్తున్నాయి.రమ్మీ ఆడలంటే బాంక్ అకౌంట్,పాన్ కార్డ్ జాత చేయడం వల్ల అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమౌతున్నాయి.ఇప్పటికే తెలంగాణ, హర్యానా,మణిపూర్ లాంటి రాష్ట్రాలు ఈ వెబ్సైట్స్ నిషేదించాయి.కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా నిషేధించాలని AIYF రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంది.హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితని కలిసిన AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ సుభాని.ఆన్ లైన్ రమ్మీ వెబ్సైట్స్ ను నిషేదించి యువత భవిష్యత్ కాపాడాలని కోరుతూ AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ సుభాని హోమ్ శాఖ మాత్యులు మేకతోటి సూచరితని కలిసి విన్నవించడం జరిగింది. స్పందించిన హోమ్ మంత్రి సూచరిత DGPతో ఫోన్లో మాట్లాడి ఈ సమస్య పరిష్కరించాలని కోరారు.DGP గౌతమ్ సవాంగ్ని కలిసిన AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ సుభాని.ఆన్ లైన్ రమ్మీకి అనేకమంది యువకులు బానిసగా మారుతున్నారని,తాజాగా నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ క్యాషియర్ రమ్మీ కి బానిసై డిపాజిట్ దార్ల సొమ్ము అతని ఖాతాలోకి మార్చుకొని రమ్మీ ఆడడం ద్వారా కోటిన్నర డబ్బులు పోగొట్టుకున్న సంఘటన DGP గౌతమ్ సవాంగ్కి వివరించగా వెంటనే స్పందించిన DGP క్రిష్ణ జిల్లా SPతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆన్ లైన్ రమ్మీ గురించి పూర్తి వివరాలు సేకరించాలని సైబర్ క్రైమ్ DIG సునీల్ నాయర్ కి చెప్పారు.అనంతరం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న AIYF నాయకులను అభినందించారు.
June 7, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రమ్మీ ఆటను నిషేధించాలని హోం మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసిన AIYF నాయకులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

