నాదెండ్ల: గణపవరంలో ఇళ్ల స్థలాల అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని ఆదివారం ఈ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. ఆయా శాఖల అధికారులూ ఆమె వెంట ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అధికారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తం 27 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం సేకరించినట్లు చెప్పారు. 59 శాతం భూమిని పాట్ల కోసం, 29 శాతం భూమిని రోడ్ల నిర్మాణం కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 1064 ప్లాట్లు వేసి లబ్ధిదారులు ఇక్కడ అందజేయనున్నామన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ఈ మొత్తం భూమిలో 1.5 శాతం భూమిని, పచ్చదనం కోసం 7 శాతం భూమిని వదిలేశామన్నారు.
ముందుచూపుతో పనిచేయాలి: ఎమ్మెల్యే
అధికారులు దగ్గరుండి ఇళ్ల స్థలాల అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అతి త్వరలో ఇవి పెద్ద పెద్ద కాలనీలు, గ్రామాలుగా రూపాంతరం చెందబోతున్నానే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలు, పచ్చదనం కోసం ఇళ్ల స్థలాల్లో వదిలేసిన భూమిని సంరక్షించుకోవాల్సిన అవసరం అధికారులపైనే ఉందన్నారు. ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి వివాదాలు రాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని, లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అధికారులు అందరిపై ఉందని తెలిపారు. విద్యుత్, తాగునీరు, మురుగుకాలువల నిర్మాణం.. ఇలాంటి మౌలిక వసతుల నిర్మాణాలు నాణ్యతతో చేపట్టేలా చూడాలని చెప్పారు. త్వరలోనే గ్రామగ్రామాన నూతన కాలనీలు సరికొత్త కాంతులతో విలసిల్లబోతున్నాయని తెలిపారు. ఇదంతా తమ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతోందన్నారు. నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో చిలకలూరిపేట కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు, నాదెండ్ల మండల తహశీల్దార్ సాంబశివరావు, ఎంపీడీవో మోజేష్, కార్యదర్శి సుబ్బారావు, మున్సిపల్, రెవెన్యూ, మండలపరిషత్ సిబ్బంది, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు కె.సుందరరావు, వి.వెంకటేశ్వరరావు, గాలి సుబ్బారావు, అంజి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కె.రమేష్ తదితరులు పాల్గొన్నారు.