728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 16, 2020

బ్యాంక్ అకౌంట్ కు ఆధార్, ATM కార్డ్ నంబర్లు అడుగుతున్న సైబర్ మోసగాళ్లు...

చిలకలూరిపేట: ఒకపక్క కరోనాతో ప్రపంచం మొత్తం సతమతమవుతోంది కరోనా  బారి నుండి ఎలా కాపాడుకోవాలి.. అంటూ ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ముఖానికి మాస్క్ తగిలించుకుని, శానిటైజర్ వాడుకుంటూ జనం అలవాటు పడుతున్నారు.

మరోపక్క చీటింగ్ చేసేవాళ్ళు ఫోన్లు చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వండి.. మీ బ్యాంక్ ఎకౌంటు క్లోజ్ అయింది.. మీ నెంబర్ ఇస్తే మీ అకౌంట్ను పునరుద్ధరిస్తామని అంటూ ఫేక్ కాల్ చేస్తున్నారు. మేము ఫలానా బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాము మీ అకౌంట్ నంబరు ఇవ్వాల్సిందే అంటూ హిందీ లో మాట్లాడుతూ కొంతమందిని నమ్మిస్తారు. చిలకలూరిపేటలో ఇటువంటి ఫోన్ కాల్స్ పట్టణ ప్రముఖులకు కూడా వస్తుండడంతో ఈ విషయంపై కొంతమంది గతంలో ఫిర్యాదు చేయడం జరుగింది.

అలానే చిలకలూరిపేట పట్టణ పరిధిలో అనేకమందికి మీ బ్యాంకు ఎకౌంటు దేంట్లో ఉంది, మీ నంబర్ చెప్పండి.. ఏటీఎం కార్డు పంపిస్తాము అంటూ రకరకాలుగా మోసాలు చేస్తూ ఉన్నారు.

గతంలో ఒక రాజకీయ నాయకునికి కూడా ఫోన్ వచ్చినపుడు నంబర్ చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆ బ్యాంక్ అకౌంట్ను వెంటనే బ్లాక్ చేశాడు. అలానే  గతంలో  చీరాల రోడ్లో ఒక వ్యక్తి అలా నెంబర్ చెప్పడంతో అతని నెంబర్ నుండి 70,000 లాగేసుకున్నారు మోసగాళ్ళు.

బాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, ఆధార్ నెంబరు ఇవ్వమని, ఏటీఎం నెంబర్ చెప్పమని ఎవరైనా ఫోను చేస్తే ఎవరు నంబర్లు ఇవ్వవద్దని బ్యాంకు అధికారులు, చిలకలూరిపేట పోలీసు అధికారులు చెబుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బ్యాంక్ అకౌంట్ కు ఆధార్, ATM కార్డ్ నంబర్లు అడుగుతున్న సైబర్ మోసగాళ్లు... Rating: 5 Reviewed By: NEWS UPDATE