728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 10, 2020

చిలకలూరిపేట మండల పరిధిలో మందుబాబులకు శుభవార్త.. నేడు తెరుచుకోనున్న వైన్ షాపులు

చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట నియోజకవర్గంలోని మూడు మండలాల్లో కేవలం చిలకలూరిపేట మండల పరిధిలోని ఉన్న రెండు వైన్ షాప్ లు మాత్రమే బుధవారం తెరుస్తున్నారు.

♦️చిలకలూరిపేట పట్టణంలో ఆరు వైన్ షాపులు, ఎడ్లపాడు లో ఒక వైన్ షాప్, చిలకలూరిపేట మండల పరిధిలో రెండు వైన్ షాపులు ఉన్నాయి.

♦️అయితే మార్చి 23 వ తేదీ పూర్తి లాక్ డౌన్ ఉన్నప్పటి నుండి పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూసివేశారు.

♦️గత నెలలో ఒకటి రెండు రోజులు అక్కడ, అక్కడ వైన్ షాపులు తెరవగా జనం రోడ్ల మీద  క్యూ కట్టేసరికి.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ వైన్ షాపులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు మూసివేశారు.

♦️చిలకలూరిపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండల పరిధిలోని వైన్ అండ్ బార్ షాపులు నరసరావుపేట ఎక్సైజ్ శాఖ పరిధిలోకి వస్తాయి. చిలకలూరిపేట పట్టణం, మండలం, ఎడ్లపాడు పరిధిలో మొత్తం తొమ్మిది వైన్ షాపులు ఉన్నాయి.

♦️సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేస్తూ బార్ అండ్ రెస్టారెంట్ లో ఉన్న మద్యం మొత్తం వైన్ షాపులకు ఇవ్వాలని జీ.ఓ జారీ చేసింది. అయితే తక్కువ రేటు ఉన్నపుడు మద్యం కొన్న షాపుల వారు ఇప్పుడు వైన్ షాప్లకు ఆ రేటుకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.

♦️చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి పరిధిలో జాతీయ రహదారి పక్కన ఒక షాపు, కట్టుబడివారి పాలెం గ్రామ పరిధిలో ఒక షాపు, ఈ రెండు వైన్ షాపులు బుధవారం ఉదయం 11 గంటలకు తెరిచి సాయంత్రం ఏడు గంటల వరకు మద్యం విక్రయాలు జరుపనున్నారు. ఈ రెండు వైన్ షాపుల్లో స్టాక్ లేనందువల్ల నరసరావుపేట నుండి మంగళవారం రాత్రి స్టాక్ తెప్పించినట్లు తెలుస్తోంది.

♦️ఏది ఏమైనప్పటికీ చిలకలూరిపేట మండల పరిధిలో రెండు వైన్ షాపులు తెరుస్తుండటంతో మందుబాబులకు కొంత ఊరటనిచ్చే అంశంగా తెలుస్తుంది. కొంత మంది అయితే ఆ షాపుల వద్ద బుధవారం ఉదయమే వెళ్లాలని మంగళవారం ఒకరినొకరు చర్చించుకుంటున్నారు.

♦️మరెందుకు ఆలస్యం మందుబాబులు వెళ్లండి ఆ షాపుల వద్దకు..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మండల పరిధిలో మందుబాబులకు శుభవార్త.. నేడు తెరుచుకోనున్న వైన్ షాపులు Rating: 5 Reviewed By: NEWS UPDATE