హైదరాబాద్:
★ దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే.
★ కరోనా వ్యాప్తి ఎప్పుడు తగ్గుతుంది ? స్కూల్స్ ఎప్పుడు రీ-ఓపెన్ చేస్తారు ? అన్న సందిగ్ధపై ఇంకా స్పష్టత రాలేదు.
★ అయితే తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆగస్టు తర్వాతే స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
★ ఇక ఇదే విషయంపై టీఎస్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ స్పందించారు.
★ తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదని ఆయన తేల్చి చెప్పారు.
★ దసరా వరకు స్కూళ్లు తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
★ మూడు నెలలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసిన తర్వాత స్కూళ్ళు, పాఠశాలలు తెరవడంపై ఆలోచిస్తామన్నారు.
★ స్కూళ్లలో శానిటైజేషన్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడం వంటివి కష్టతరమని చెప్పుకొచ్చారు.
★ కాగా, జులై 1 నుంచి 15 వ తేదీ వరకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈ/ఐఎస్‌సీ ఎగ్జామ్స్ జరగాల్సి ఉండగా... జులై 26 న నీట్, జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ పరీక్షలను నిర్వహించనున్నారు.