విశాఖపట్నం: జిల్లాలో వీఆర్‌ఏ సారిపల్లి సత్యనారాయణ(55) మంచి నీళ్లు అనుకొని శానిటైజర్ తాగడంతో ప్రాణాలు కోల్పోయారు. నక్కపల్లి ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. సారిపల్లిపాలేనికి చెందిన సత్యనారాయణ ఉపమాకలో వీఆర్‌ఏగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం కార్యాలయానికి తాళాలు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. అక్కడ బల్లపై సీసాలో ఉన్న శానిటైజర్‌ను మంచినీరనుకుని తాగేశారు. వెంటనే ఆ విషయాన్ని గుర్తించి సర్వేయర్‌కు తెలపడంతో అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అరగంట తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపేశారు. రాత్రి 8 గంటల సమయంలో సత్యనారాయణకు వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబసభ్యులు నక్కపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అనకాపల్లి ప్రాంతీయాసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మరణించారు.
June 8, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మంచినీళ్లనుకుని శానిటైజర్ తాగి వీఆర్‌ఏ మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

