ముంబయి: కేరళలో హృదయవిదారక పరిస్థితుల్లో ఏనుగు మృతిచెందిన ఉదంతంపై టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ తాజాగా విచారం వ్యక్తం చేశాడు. ఏ జంతువు కూడా అలాంటి క్రూరమైన హింసకు బలికాకూడదన్నాడు. బుధవారం సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా చాలా మంది తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న రోహిత్ గురువారం స్పందించాడు. ‘మనం క్రూరులం. ఎలా ఉండాలో ఇంకా నేర్చుకోవట్లేదా? కేరళలో ఆ ఏనుగుకు ఏం జరిగిందో తెలిసి హృదయం బరువెక్కింది. ఏ జంతువు కూడా అలాంటి క్రూరత్వానికి బలికాకూడదు’ అని ట్వీట్ చేశాడు.
కాగా, ఇదే విషయంపై టీమ్‌ఇండియా సారథి విరాట్‌కోహ్లీ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేరళలో జరిగిన విషయం తెలిసి ఆవేదన చెందానని, జంతువులపై ప్రేమను చూపండని కోహ్లీ పేర్కొన్నాడు. ఇలాంటి హేయమైన చర్యలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చాడు. ఇక భారత ఫుట్‌బాల్ సారథి సునిల్ ఛెత్రీ సైతం ఈ ఘటనపై ఆవేదన చెందాడు. గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారణమైన వాళ్లు రాక్షసులని, అందుకు వారు మూల్యం చెల్లించుకుంటారని కోపోద్రిక్తుడయ్యాడు. వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా ఇన్‌స్టాలో దీన్ని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించాడు. జంతువుల పట్ల ప్రేమగా ఉంటే మానవులకు వచ్చే నష్టం ఏం లేదన్నాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.