728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 18, 2020

వైఎస్ఆర్ సీపీ మైనార్టీ నాయకులు ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

చిలకలూరిపేట:
జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం చేసినందుకు ఈ రోజు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మైనారిటీ సెల్ ఆధ్వర్యంలోముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ముస్లిం,మైనారిటీ నాయకులు.

ముందుగా చైనా బోర్డర్ లో అసువులు బాసిన భారతదేశ వీర జవాన్లకు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం వారు మాట్లాడుతూ ముస్లిం,మైనార్టీలకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉంది అంటే అది వై.యస్.అర్ పార్టీ ఏ అని అన్నారు.మేము చిలకలూరిపేటలో  ఎన్‌పీఆర్,ఎన్‌ఆర్‌సీ లకు వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యక్రమంలో మాకు అండగా నిలిచి మా మాటలను ముఖ్యమంత్రి  దగ్గరకు తీసుకువెళ్లిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి  ఆనాడే చెప్పారు ఈ దేశం మ‌న‌ది. ఈ మ‌ట్టి మ‌న‌ది. ఇక్క‌డే పుట్టాం. ఇక్క‌డే మ‌ర‌ణిస్తాం. కాదు.. కూడ‌దు.. అనుకుంటూ ఎవ‌రైనా మ‌న‌దేశం నుంచి మ‌న‌ల్ని విడ‌దీయాల‌ని వ‌స్తే వారి సంగ‌తి తేల్చే వ‌ర‌కు మ‌నం నిద్ర‌పోకూడ‌దు.ఎన్ ఆర్ సీని అమ‌లు చేయ‌బోమ‌ని మ‌న సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆనాడు ఏది అయితే చెప్పారో ఈనాడు అది అమలు చేసి చూపించారు.సీఎం వైఎస్‌ జగన్‌ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముస్లింలకు భరోసా వచ్చిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి అల్లిమియా,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహ ఖాన్,పార్టీ అధికార ప్రతినిధి దరియా వలి, పట్టణ మైనారిటీ ఉపాధ్యక్షుడు యూసుఫ్  ఖాజా వలి,పార్టీ సీనియర్ నాయకులు బషీర్ మేస్త్రి,వేటపాలెం సుభాని,అబ్బాస్ ఖాన్,మటన్ బాషూ, కరీముల్లా,నాగూర్,రఫాని, వెల్డింగ్ కరీముల్లా,పసుమర్రు మస్తాన్ వలి,బాజీ,యూసుబ్,షేక్ వలి,నాగూర్,జానీ,షుకూర్,అలీ,సలాం,సుభాని,వలి,మస్తాన్ వలి,మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వైఎస్ఆర్ సీపీ మైనార్టీ నాయకులు ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం Rating: 5 Reviewed By: NEWS UPDATE