728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 18, 2020

ఆర్యవైశ్యులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వమే

చిలకలూరిపేట:
వై.యస్.అర్.సీపీ కార్యాలయంలో దేవాదాయ.ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు  మీద నిన్న మండలి లో జరిగిన దాడిని ఖండించిన చిలకలూరిపేట ఆర్యవైశ్య నాయకులు.

వెల్లంపల్లి శ్రీనివాసరావు తో పాటు వైశ్యులు అందరు వై.యస్.అర్.సీపీ వైపు మొగ్గు చూపుతున్నారని టీడీపీ వైపు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దాలి గిరి  కూడా వై.యస్.అర్.సీపీ వైపు ఉండటం ఓర్వలేని నారా లోకేష్ తోటి సభ్యులను రెచ్చగొట్టి వెల్లంపల్లి శ్రీనివాస్  మీద దాడికి పాల్పడ్డారు.

గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక వైశ్య విలేఖరిని బలి తీసుకోవటమే కాకుండా చిలకలూరిపేట ఆర్యవైశ్యులు దగ్గర గవర్నమెంట్ టాక్స్ కాకుండా వెంకాయమ్మ టాక్స్ లు వసూలు చేశారు,అదేవిధంగా మాచర్లలో నారా లోకేష్  ప్రోద్బలంతో ఒక వైశ్య వ్యక్తిని చైర్మన్ చేసి మధ్యలోనే వారి చేత పదవి విరామం చేపించి వారి కుటుంబం మొత్తాన్ని  బలి తీసుకున్నారు.దానికి ప్రతిఫలంగా ఈ నాడు 23 సీట్లతో అనుభవిస్తున్నారు,మీరు ఇలానే దాడులు చేస్తే ఈ సారి 2 +3 మొత్తం 5 ఏ వస్తాయి అని అన్నారు.

అడ్డగోలుగా మంత్రి అయ్యి ముఖ్యమంత్రి కొడుకు అయ్యి ఉండికూడా మంగళగిరిలో ఘోర పరాజయం పొందిన లోకేష్ ఇకనైనా బుద్ది తెచ్చుకొని ప్రవర్తించాలి అని లేకపోతే ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొడతారు అన్నారు.

ఈ కార్యక్రమంలో కొలిశెట్టి శ్రీనివాసరావు,తులాబందుల సుధాకర్,కొప్పురావూరి నాగేశ్వరరావు(పటేల్),రాచుమల్లు రాధాకృష్ణ,కె.వి.యస్.కృష్ణుడు,దాచేపల్లి నాగేశ్వరరావు,కొలిశెట్టి శివసుబ్రమణ్యం,తులబంధుల మని,దర్శి సుబ్బారావు,ఆలపాటి వెంకటరావు, అర్వపల్లి సుధాకర్ మరియు పలువురు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆర్యవైశ్యులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వమే Rating: 5 Reviewed By: NEWS UPDATE