చిలకలూరిపేట: మురికిపూడిలోని శ్రీమతి కందిమళ్ల శారదాంబ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలతోపాటు, ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహిస్తున్న నాడు-నేడు పనులను ఎమ్మెల్యే విడదల రజిని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో నాడు- నేడు పనుల్లో జాప్యం జరగకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు-నేడు పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో నాడునేడు పనుల కోసం ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ విడుదలైందన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతులు, తాగునీరు, విద్యుత్ సదుపాయం, మేజరు- మైనరు మరమ్ముతులు చేపడుతున్నట్లు చెప్పారు. ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఆంగ్ల ప్రయోగశాల, రంగులు తదితరాలన్నింటినీ ప్రభుత్వమే అన్ని పాఠశాలలకు పంపుతుందని తెలిపారు. పాఠశాలలకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రహరీ గోడలను కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. నాడునేడు పనుల కింద చేపట్టిన విద్యుదీకరణ నియోజకవర్గంలో దాదాపు 75 శాతం పూర్తవగా.. చిలకలూరిపేట రూరల్ మండలం 80 శాతం పూర్తయిందని చెప్పారు. నాడునేడు పనుల్లో నియోజకవర్గంలో సంతృప్తికరస్థాయిలో పురోగతి ఉందన్నారు. నియోజకవర్గంలో మొత్తంమీద సగటున 60 శాతం పనులు పూర్తవగా.. చిలకలూరిపేట మండలంలో 65 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎంఈవో కె.లక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరిముల్లా, పార్టీ నాయకులు ఆరుమళ్ల వెంకటశివ, దేవయ్య, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
June 14, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మురికిపూడి జెడ్పీ, ప్రాథమిక పాఠశాలల్లో నాడు- నేడు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

