అమరావతి: అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిబ్బందని వెంట తీసుకురావద్దని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక బులెటిన్‌ను విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో పలు నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భౌతికదూరం పాటించిందేకు ప్రత్యేక నిబంధనలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీ అనుమతి ఉంటుదని తెలిపారు. ఎమ్మెల్యే తమ కార్లకు కారు పాస్ కచ్చితంగా అతికించాలని పేర్కొన్నారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
గుర్తు తెలియనివారికి అసెంబ్లీలోకి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. గన్‌మేన్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి విజిటర్లను అనుమతించకూడదని నిర్ణయించారు. అసెంబ్లీలోకి ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దని సభ్యులకు ఆదేశాలు జారీచేశారు. బ్యానర్లు, ప్ల కార్డ్స్, కర్రలు, స్ప్రేలు వంటివేవీ అనుమతించమని, అసెంబ్లీ ఆవరణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు. సభ్యులంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. సభ్యులు వెంట విజిటర్లను తీసుకురావొద్దని మార్గదర్శకాలు జారీచేశారు. సభ్యులు పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌ఓలను వెంట తీసుకురావొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఇక రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే..