728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 2, 2020

విజయవాడ ➔ చందవరం... చందవరం ➔ చిలకలూరిపేట... కరోనా వైరస్ పయనం

చిలకలూరిపేట:
♦️ప్రపంచంలో కరోనా వైరస్ మొదటగా చైనా లోని ఊహన్ నగరంలో  పుట్టిన విషయం ప్రపంచం మొత్తం తెలుసు.

♦️అయితే చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా వైరస్ మహమ్మారి విజయవాడ నుండి ప్రయాణం చేస్తూ...చందవరం, చిలకలూరిపేట, ఎడ్లపాడు తదితర ప్రాంతాలకు సోకింది.

♦️చిలకలూరిపేట పట్టణంలో మొదటగా ఏప్రిల్ నెలలో నరసరావుపేటలో వైద్యం చేస్తూ చిలకలూరిపేట కు చెందిన  ఒక వైద్యురాలికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆ యువతి కోలుకొని కంటైన్మెంట్ జోన్ ఎత్తి వేస్తారనగా మే నెల 23వ తేదీన పిడుగులాంటి వార్త ఒకటి నియోజకవర్గంలో తెలిసింది.

♦️చందవరం గ్రామానికి చెందిన ఒక వృద్ధుని కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని  వైద్య అధికారులు 23 వ తేదీన ప్రకటించారు. ఆ వృద్ధుడు విజయవాడ లో నైట్ వాచ్ మెన్ గా పనిచేస్తూ అనారోగ్యంతో ఉన్న తనను తన సొంత గ్రామమైన చందవరం కు అతని కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు.

♦️తీవ్ర అనారోగ్యం పాలైన అతన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో మే నెల 18వ తేదీన జాయిన్ చేశారు.అయితే  అతనికి తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో ఆ వృద్ధుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 20 తేదీన తరలించారు. 20 తేదీన ఆ వృద్ధుడు మృతి చెందటంతో 21వ తేదీన అతని మృతదేహాన్ని ఖననం చేశారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.

♦️అయితే 23 వ తేదీన ఆ వృద్ధునికు కరోనా పాజిటివ్ ఉందని ప్రభుత్వం ప్రకటించడంతో ఆ వృద్ధుని ద్వారా ఎవరెవరికి కరోనా సోకిందోనని వైద్యులు పరీక్షలు చేపట్టారు. నేటి వరకు ఆ వృద్ధుని ద్వారా కరోనా  సోకిన వ్యక్తులు చైన్ లింకుల ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గంలో తొమ్మిది మంది వరకు వున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది.

♦️ఆ వృద్ధుని భార్య, కుమార్తె నాదెండ్ల మండలంలో, వారి బంధువులు అయిన ఒక యువతికి ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం లో కరోనా సోకింది.

♦️ఆ వృద్ధుడు చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నప్పుడు అతని మంచం మీద ఉన్న దుప్పట్లు ఉతికిన పట్టణంలోని రజక వీధిలో ఉన్న  ధోభీ కు కరోనా పాజిటివ్ వచ్చింది.

ఇది ఇలా ఉంటే చందవరం గ్రామము ద్వారా ఇంకొక ఐదుగురికి ఈ వైరస్ సోకింది. అదెలాగో చూద్దాం...

♦️పట్టణానికి చెందిన చిన పీరుసాహెబ్ వీధి మహిళ తీవ్ర అనారోగ్యంతో చిలకలూరిపేట పట్టణం లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లగా వైద్యుని సలహా మేరకు ఆ మహిళ 20 తేదీన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఈమె మంచం ఎదురుగా చందవరం వృద్దుడు ఉండటంవల్ల ఈ మహిళకు కూడా కరోనా సోకింది.  ఈ మహిళ ద్వారా వారి బంధువులు ముగ్గురికి ఎడ్లపాడులో కరోనా వైరస్ వ్యాపించింది.

♦️తాజాగా సోమవారం ఆ మహిళ కుమారునికి కూడ కరోనా  పాజిటివ్ రావడంతో అతనిని ఐసోలేషన్కు  తరలించారు.

ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి...

♦️ పట్టణంలో చిన్నపీరుసాహెబ్ వీధి లో ఈ మహిళ ఉంటున్న ఇంటి పక్కన ఒక ఇంట్లో భార్య భర్త కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. కానీ ఈ మహిళ 20 తేదీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినప్పటి నుంచి వీరి కుటుంబ సభ్యులు ఎవరు చిలకలూరిపేటకు రాలేదు.

♦️వారి ఇంటి పక్కన పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో  ఒకతను ఒక ప్రైవేటు కంపెనీలో వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. అతని ప్రైమరీ కాంటాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పటికీ చిక్కుముడి గానే ఉంది.

♦️నిన్న తాజాగా చినపీరుసాహెబ్ వీధికి చెందిన యువకునికి కరోనా పాజిటివ్ వచ్చినందున, అతని కాంటాక్ట్స్ ఉన్న 11 మందిని మంగళవారం పరీక్ష నిర్వహించారు.

♦️సోమవారం చిలకలూరిపేట పట్టణానికి చెందిన చినపీరుసాహెబ్ వీధి వ్యక్తి పాజిటివ్ అని తెలియజేయడంతో ఈ యువకుడు 27వ తేదీన విజయవాడ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకొని విజయవాడ నుండి నెల్లూరు వెళుతున్న బస్సులో ప్రయాణం చేసి చిలకలూరిపేట బస్ స్టాండ్ లో దిగగా ...ఆ విషయం తెలుసుకున్న కొందరు పోలీసులకు, వైద్యులకు తెలియజేయడంతో అతనిని క్వారంటైన్ కు తరలించారు.

♦️ఇతను వచ్చిన బస్సులో ఎవరెవరు ప్రయాణించారు అనే విషయం అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

♦️ఏది ఏమైనప్పటికీ విజయవాడ నుంచి ప్రయాణం చేసిన ఈ వైరస్  మొత్తం10 మంది కి సోకింది.

♦️విజయవాడ నుంచి వచ్చిన కోవిడ్ వైరస్ కాక  కేవలం మూడు కేసులు మాత్రమే ఇతర వ్యక్తుల ద్వారా చిలకలూరిపేట లో  సోకినట్లు తెలుస్తుంది. ఇప్పటికీ 13 మందిలో ఒక వృద్ధుడు మృతి చెందగా, ఒకరు రికవర్ కాగా, నియోజకవర్గంలో 11 మంది ఐసోలేషన్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

♦️ఇంకా ఈ విజయవాడ వైరస్ ఎంతమందికి సోకుతుందోనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విజయవాడ ➔ చందవరం... చందవరం ➔ చిలకలూరిపేట... కరోనా వైరస్ పయనం Rating: 5 Reviewed By: NEWS UPDATE