చిలకలూరిపేట:
🔸వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మీ పాలన మీ సూచన పేరుతో రాష్ట్ర పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేరకు చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
🔸ఈ ఏడాది పాలనలో, పాలన రాజ్యాంగ వ్యతిరేక చట్ట వ్యతిరేక పాలనగా కొనసాగుతోందని, ప్రత్యేక హోదా కావాలని అది తమ హక్కని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.రాధాకృష్ణ తెలిపారు.
🔸రాజధాని మార్పు, ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్లింపు, టీడీపీకి మించిన ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా ఎం రాధాకృష్ణ గుర్తుచేశారు.
🔸ఈ సంవత్సర కాలంలో 90శాతం పైగా ఫెయిల్యూర్ లు ఉన్నాయని, తాము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.ప్రసన్న, షేక్ కరిమున్, కోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, మర్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
