నరసరావుపేట: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కరోనాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ, కరోనా కట్టడికి అధికారులు అనుసరిస్తున్న విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలను చర్చించారు. ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరరావు, నరసరావుపేట రూరల్ సీఐ అచ్చయ్య, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనలతో రోగనిరోధక శక్తిని పెంచేందుకు.. జొన్నలగడ్డ అన్నమయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ వారు తయారు చేసిన పౌడర్‌ను, కరోనా వ్యాప్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగనిరోధక శక్తిని పెంచే ఆహార మార్గదర్శకాలపై విడుదల చేసిన పత్రాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు.
అనంతరం నరసరావుపేట పట్టణంలోని 1700 కుటుంబాలకు..ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ జాతీయ అధ్యక్షులు పునుగుపాటి పూర్ణచంద్రరావు నిర్వహించిన కూరగాయల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరరావు పాల్గొని అందించారు.