గుంటూరు: సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. గుంటూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్‌కు ఎమ్మెల్యే బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాల్సిందిగా కోరుతూ నగదు చెక్కులను ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలువురు దాతలు తమకు తోచిన సాయం అందజేశారని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో కూలీలు సైతం కొంత కూడబెట్టుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారని తెలిపారు. కరోనా ఆపద సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు చాలా మంది ముందుకువచ్చి తోచిన ఆర్థిక సాయం చేస్తుండటం అభినందనీయమని కొనియాడారు. నియోజకవర్గంలో పలువురు నుంచి అందుకున్న చెక్కులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్‌కు అందజేశారు.
June 3, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: జిల్లా కలెక్టర్ కు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
Rating: 5
Reviewed By: NEWS UPDATE

