728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 10, 2020

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫోన్‌కే కరోనా ఫలితం..!

అమరావతి:
♦️ఏపీలో ఇకపై కరోనా టెస్టుల ఫలితాలు సంబంధిత వ్యక్తి ఫోన్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందనున్నాయి.

♦️ప్రస్తుతం కరోనా నిర్ధారణ టెస్ట్ రిజల్ట్స్ వెల్లడించే విధానంలో కొన్ని లోపాలు తలెత్తుతుండటంతో.. ఈ కొత్త విధానాన్ని మంగళవారం నుంచి అమలులోకి తీసుకొచ్చారు.

♦️వాస్తవానికి కరోనా పరీక్షల చేయించుకున్న తర్వాత ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతుంది.

♦️వాటిని ఆన్లైన్ ద్వారా వైద్యులు, ఆసుపత్రి సూపరిటెండెంట్లకు తెలియజేస్తారు.

♦️ఈ క్రమంలోనే కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి.

♦️వాటిని అధిగమించడం కోసమే కరోనా టెస్ట్ ఫలితాలను నేరుగా చేయించుకున్న వ్యక్తి సెల్‌ఫోన్‌కే మెసేజ్ ద్వారా అందజేయనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు.

♦️కాగా, వైద్య ఆరోగ్యశాఖ పంపే లింకు ఆధారంగా కూడా కరోనా ఫలితాన్ని చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫోన్‌కే కరోనా ఫలితం..! Rating: 5 Reviewed By: NEWS UPDATE