728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 2, 2020

చిలకలూరిపేట మరో చెన్నై కాకుండా చూడండి: కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధాకృష్ణ

చిలకలూరిపేట: పట్టణాన్ని మరో చెన్నై కానివ్వకండి వర్షాలు పడక ముందే మురుగునీటి కాలువలు శుభ్రం చేయించండని  చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ యం రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. పురపాలక సంఘం పరిధిలో మీయొక్క కృషి మరియు అన్ని విభాగాల అధికారుల సమిష్టి కృషి సమన్వయ విధానాలతో కరోనా వ్యాధి విస్తరించకుండా విజయవంతంగా  విధులు నిర్వర్తించి నందుకు హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసారు.  పులి మీద పుట్రలా  ఋతుపవనాలు ముందుగా రావడం కారణంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితుల్లో అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఇప్పటివరకు ఫలించిన  మీ కృషి కొనసాగించిబడేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవలసిన ఆవశ్యకతను మీ దృష్టికి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు.  ముఖ్యంగా రెడ్ జోన్, బఫర్ జోన్ ప్రాంతాలలో మీరు తక్షణమే అన్ని కాలువలలో కూడా సిల్ట్ తీయించి  మురుగునీటి నిలువ జరగకుండా  పారుదల ప్రక్రియ కొనసాగేందుకు తగు చర్యలు తీసుకోమని ఈ వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా పట్టణ ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మరో చెన్నై కాకుండా చూడండి: కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధాకృష్ణ Rating: 5 Reviewed By: NEWS UPDATE