చిలకలూరిపేట: గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పసుమర్రులో బుధవారం ఎమ్మెల్యే పర్యటించారు. స్థానిక చెరువును ఇటీవల సాగర్ జలాలతో నింపగా.. నీటిని పరిశీలించారు. అనంతరం పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు ఎంపిక చేసిన భూమి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి 2 వేలు జనాభాకు ఒక సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ తీసుకొస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టంచేశారు. దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా గ్రామ పరిపాలనపై ఇంతగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవన్నారు. ఒక్కో సచివాలయానికి సరిపడా సిబ్బందిని నియమించిన ఘనత తమదేనన్నారు.
వాలంటీర్లు, కార్యాలయ సిబ్బందితో గ్రామాలు, పట్టణాలు ఇప్పుడు పరిపుష్టమైన పరిపాలనను సొంతం చేసుకున్నాయని వెల్లడించారు. పసుమర్రు గ్రామాన్ని చిలకలూరిపేట పట్టణంలో విలీనం చేసి తమ చిత్తశుద్ధిన నిరూపించుకున్నామని ఎమ్మెల్యే విడదల రజిని తెలిపారు. గ్రామానికి మంచినీటి సమస్య ఉన్నదని స్థానిక నాయకులు తన దృష్టికి తీసుకురాగానే సాగర్ కాలువల అధికారులతో మాట్లాడి నీరు తీసుకొచ్చామని చెప్పారు.ఇప్పుడు నియోజకవర్గంలోని చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు. గ్రామల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు.
అర్హులందరికీ ప్రభుత్వ లబ్ధి అందాల్సిందే..
అనంతరం ఎమ్మెల్యే పట్టణంలోని ఇళ్ల లబ్ధిదారులందరికీ ఇస్తున్న ఇళ్ల స్థలాలను పరిశీలించారు. పసుమర్రు పరిధిలోనే ఉన్న ఈ స్థలాల అభివృద్ధి పనులు మొదలవడంతో ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదాపు రూ.కోటిన్నర నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. భూమి చదును, అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తవగానే మంచినీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు కల్పిస్తామని, అనంతరం ప్రతి ఒక్కరికి స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన గృహాలను కూడా నిర్మించి ఇస్తామని తెలిపారు. ఆ ఇళ్లను కుటుంబంలోని మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పసుమర్రు గ్రామ అధ్యక్షుడు మస్తాన్‌వలి, పార్టీ నాయకులు జాలాది సుబ్బారావు, సుభాని, గొట్టిపాటి ఉమ, కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు,టౌన్ సర్వేయర్, టౌన్ ప్లానింగ్ అధికారి, మండల పరిషత్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పసుమర్రు నాయకులు జాలాది సుబ్బారావు ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకర్ ఏర్పాటు..
ఈ రోజు పసుమర్రు గ్రామ నాయకులు జాలాది సుబ్బారావు ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకర్ ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే విడదల రజిని దానిని ప్రారంభించారు.