728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 15, 2020

చిలకలూరిపేట పట్టణంలో కరోనాను జయించిన ఆరుగురు.. చికిత్స పొందుతున్న ఇద్దరు

చిలకలూరిపేట:
🔹చిలకలూరిపేట పట్టణంలోని శివాలయం వీధిలో ఏప్రిల్ నెలలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో చికిత్స అనంతరం నెగటివ్ రాగా ఆ మహిళ ఇంటికి చేరుకొని  కరోనాను జయించింది.

🔹అలానే చినపీరుసాహెబ్ వీధిలో అయిదుగురు  వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడంతో వారిలో ఇరువురు ఈనెల ఎనిమిదో తేదీన కోలుకొని వారి ఇంటికి వచ్చారు. అదే వీధిలో మొదట కరోనా పాజిటివ్ నమోదుఅయిన మహిళ కోలుకుని నెగటివ్ రిపోర్ట్ రావటంతో 11 వ తేదీ ఆ మహిళ కూడా ఇంటికి చేరుకున్నారు. అదే వీధిలోని ఇంకొక వ్యక్తి 15 వ తేదీ సోమవారం ఇంటికి చేరుకొనున్నారు.ఈ విధంగా చినపీరుసాహెబ్ వీధిలో నలుగురు కరోనాను జయించారు.

🔹అలానే రజక వీధిలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈనెల 8వ తేదీ ఆ మహిళ కూడా కోలుకొని ఇంటికి చేరుకోవడంతో మొత్తంమీద పట్టణంలో ఇప్పటివరకు ఎనిమిది మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ రాగా వారిలో ఆరుగురు రిపోర్ట్ నెగటివ్ గా రావడంతో వారి ఇళ్లకువారు వచ్చి సురక్షితంగా కరోనాను జయించిన వ్యక్తులయ్యారు.

♦️కాగా ప్రస్తుతం చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం నమోదు అయిన పాజిటివ్ కేస్, ఆదివారం సుబానినగర్ లో నమోదు అయిన పాజిటివ్ కేసుతో ఇరువురు చికిత్స పొందుతున్నారు.

♦️మొత్తం మీద ఆదివారం నాటికి ఇప్పటి వరకు పట్టణంలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యి ఆరుగురు రికవర్ అయ్యి ఇళ్లకు వచ్చారు. మిగతా ఇరువురు చికిత్స పొందుతూ వున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో కరోనాను జయించిన ఆరుగురు.. చికిత్స పొందుతున్న ఇద్దరు Rating: 5 Reviewed By: NEWS UPDATE