728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 16, 2020

పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి: చంద్రబాబు

అమరావతి:
★ కరోనా కష్టాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ మరో తుగ్లక్ చర్య.

★ ఒకవైపు కరోనా రాష్ట్రంలో రోజురోజుకు ఉధృతం అవుతోంది.

★ కోవిడ్ వైరస్ నియంత్రణపై మీ(జగన్మోహన్ రెడ్డి) నిర్లక్ష్యం వల్లే ఇప్పుడది అన్ని జిల్లాలలో విజృంభించింది.

★ మొదట్లో పారాసిటమాల్, బ్లీచింగ్ చాలని తేలిగ్గా వ్యాఖ్యలు చేశారు.

★ మీ పార్టీ వాళ్లు కరోనాను చాలా తేలిగ్గా తీసుకున్నారు. ట్రాక్టర్ల ర్యాలీలు, పూలు జల్లించుకోడాలు, సంబరాలు-ఉత్సవాల్లో మునిగి, కరోనా కట్టడిలో విఫలం అయ్యారు.

★ ఈ విపత్కర పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు పెట్టి విద్యార్ధుల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం అవివేకం.

★ రోజురోజుకూ కరోనా ఉధృతం అవుతున్న తరుణంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ అవివేకం.

★ మీకు తెలియదు, ఇతరులు చెబితే వినరు, తోచిందే చేస్తారు, అడ్డంగా మాట్లాడతారు.

★ ఇష్టారాజ్యంగా వ్యవహరించే రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తెచ్చారు.

★ ఇప్పటికే అన్నివర్గాల ప్రజల జీవితాలతో ఆడుకున్నారు.

★ ఇప్పుడిక విద్యార్ధులపై మీ కన్ను పడింది.

★ మీ తుగ్లక్ చర్యలకు విద్యార్ధుల ఆరోగ్యాన్ని బలిపెట్టవద్దు.

★ కరోనాలో స్థానిక ఎన్నికలు జరపాల్సిందే అని పట్టుబట్టడం ఒక తుగ్లక్ చర్య.

★ ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం ఇంకో తుగ్లక్ చర్య.

★ 3 రాజధానుల పేరుతో 3ముక్కలాట ఒక తుగ్లక్ చర్య.

★ ఇప్పుడీ కరోనాలో పరీక్షలు మరో తుగ్లక్ చర్య.

★ ఇప్పటికే అనేక తిక్కచేష్టలతో రాష్ట్ర భవిష్యత్ దెబ్బతీశారు.

★ ఇప్పుడీ అనాలోచిత నిర్ణయంతో విద్యార్ధుల ఆరోగ్యాన్నే కరోనాకు బలి పెడతారా..?

★ ప్రజల ప్రాణాలతో ఆడుకోడానికి కాదు మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బతిమాలి తీసుకుంది.

★ అనేక రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయి.

★ ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ క్షేమదాయకం కాదు.

★ మన రాష్ట్రంలో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి.

★ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడే చర్యలకు ఇకనైనా స్వస్తి చెప్పాలి. కోవిడ్ వైరస్ నియంత్రణా చర్యలను మరింత పకడ్బందీగా చేపట్టాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE