728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 2, 2020

చిలకలూరిపేటలో బఫర్ జోన్లలోని వ్యాపారాలపై స్పష్టతనిచ్చిన సిఐ సూర్యనారాయణ

చిలకలూరిపేట:
🔸గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని కంటైన్మెంట్ జోన్  ప్రాంతాన్ని చిలకలూరిపేట మున్సిపల్, పోలీస్, అధికారులు కుదించారు.

🔸పట్టణంలోని కళామందిర్ థియేటర్ పక్కన ఉన్న శివాలయం వీధిలో ఇప్పటి వరకు ఉన్న కంటైన్మెంట్ జోన్ సోమవారం రాత్రి ఎత్తివేశారు.

200 మీటర్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్లు..

🔸చినపీరుసాహెబ్ వీధిలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంత పరిధిలో 200 మీటర్ల మేర కంటైన్మెంట్ జోన్ ఉండబోతుంది.

🔸శారదా హైస్కూల్,కళామందిర్ థియేటర్, గుర్రాలచావిడి  వరకు కంటైన్మెంట్ జోన్ 200 మీటర్ల పరిధిలో ఉంటుంది.

🔸అలానే రజక వీధి లో నమోదైన పాజిటివ్ కేసు ప్రాంత పరిధి 200 మీటర్ల మేర కృష్ణ మహల్ థియేటర్, చౌత్రా సెంటర్ కొంత భాగం, హోండా షోరూం వరకు కంటైన్మెంట్ జోన్ వుంటుంది.

బఫర్ జోన్ల ఎత్తివేత..

🔸పట్టణంలోని మిగతా ప్రాంతాల్లో బఫర్ జోన్ను ఎత్తి వేశారు.  అయితే బఫర్ జోన్ లో ఉన్న మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బారికేడ్లు తొలగించకుండా దశలవారీగా అవి ఎత్తి వేస్తారు.  ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలు, కిరాణా షాప్,మార్కెట్ ప్రాంతాల్లో రాకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

🔸కాగా మంగళవారం ఉదయం నుండి బఫర్ జోన్ లోని  అన్ని వ్యాపార షాపులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరుచుకోవచ్చని అర్బన్ సిఐ సూర్యనారాయణ తెలిపారు.

నంబరింగ్ ప్రకారం షాపులు తీయాలి..

🔸అయితే మున్సిపల్ అధికారుల నిబంధనల ప్రకారం 1, 2  ప్రకారం ఒకరోజు ఒక నెంబర్,మరుసటి రోజు ఇంకో నెంబర్  గల షాపులు తెరిచేలా మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు.

🔸ప్రతి షాప్ లో వ్యాపారస్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, శానిటైజర్ వాడుతూ వ్యాపారం చేసుకునేలా నిబంధనలు సూచించారు.

🔸అయితే పట్టణంలోని రద్దీగా ఉండే ప్రదేశాలు, చర్చిలు,మసీదులు, దేవాలయాలు... సమావేశాలు పై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి.

ఈ వ్యాపారాలు చేయరాదు..

🔸పట్టణంలో టి కోట్లు మరియు పానీ పూరి బండ్లు తెరవ రాదు. టిఫిన్ వారు కేవలం  పార్సెల్ ఇచ్చే లాగా ఏర్పాటు చేసుకోవాలని పట్టణ సిఐ సూర్యనారాయణ తెలియజేశారు.

8వ తేదీ నుండి కంటైన్మెంట్ జోన్ల పరిధి కుదింపు..

🔸ఈ పైన తెలియజేసిన కంటైట్మెంట్ జోన్లు  ఈనెల 8వ తేదీన మరలా ఆయా ప్రాంతాలను కుదించి, బఫర్ జోన్ లో ఉన్న బారికేడ్లు పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నాయి.

🔸ఎనిమిదో తేదీ నుండి కేవలం పాజిటివ్ సోకిన వ్యక్తి వీధి వరకు మాత్రమే మూసి వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో బఫర్ జోన్లలోని వ్యాపారాలపై స్పష్టతనిచ్చిన సిఐ సూర్యనారాయణ Rating: 5 Reviewed By: NEWS UPDATE