728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 3, 2020

దేవాలయంలోగానీ, ఇంట్లో గానీ గంట ఎందుకు కొడతారు?

గుడికి వెళ్ళిన ప్రతిసారి దేవుని ఎదురుగా ఉండే గంట కొడుతుంటారు.అసలు దేవాలయంలో గంట ఎందుకు కొడుతారో తెలుసా? ఇంట్లో లేదా గుడిలో పూజ చేసున్న సమయంలో హారతిస్తాం. ఆ సమయంలో గంట కొడుతారు. ఆలయంలో ఉన్న గంటలో అర్థాలు చాలానే ఉన్నాయి. దేవాలయం వెళ్ళినప్పుడు గంటకోడితే మనసుకి ఆధ్యాత్మిక, ఆనందం కలగడమేకాకుండా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. గంట నాలుకలో సరస్వతీదేవి కోలువై ఉంటుందట. గంట ఉదర భాగం లో మహా రుద్రుడు, బ్రహ్మ దేవుడు...ముఖ భాగంలోను, కొన భాగంలో వాసుకి, పైన వుండే పిడి భాగంలో ప్రాణశక్తి వుంటుందని పండితులు అంటున్నారు. అందుకే గంటను పవిత్రంగా భావించి దైవం గా పూజించాలి. గంటను మోగిస్తే, ఆ గంట నుంచి వచ్చే "ఓంకార" శబ్దం వల్ల దుష్ట శక్తులు తొలగి బాధలుదరిచేరవట. "హారతి" సమయంలో గంటకొడితే, మన ఇంటిలో లేదా దేవాలయంలో దేవతామూర్తుల విగ్రహాల్లోకి దేవతలను ఆహ్వానం పలుకుతున్నామని అర్ధం. హారతి సమయంలో గంట కొట్టే సమయంలో కళ్ళు మూయరాదు. ఆ సమయం లో హారతి ఇస్తూ, గంట కొడుతూ దైవాన్ని ఆహ్వానిస్తూ పూజారి మనకు చూపిస్తున్నారని అర్ధం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: దేవాలయంలోగానీ, ఇంట్లో గానీ గంట ఎందుకు కొడతారు? Rating: 5 Reviewed By: NEWS UPDATE