728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 13, 2020

చిలకలూరిపేట: బతికుండగా ఆదరించలేదు చనిపోయాక కనికరించలేదు

చిలకలూరిపేట: అతను బ‌తికిఉండ‌గా ఆద‌రించ‌లేదు.. చ‌నిపోయాకా కూడా మాన‌వ‌త్వం చూప‌లేదు. ఎందుకంటే క‌రోనా భ‌యం.ఈ భ‌యమే సాటి మ‌నిషిని మ‌నిషిగా చూడ‌టానికి, ఆద‌రించ‌టానికి, క‌నీసం నాలుగు ఓదార్పు మాట‌లు చెప్ప‌టానికి, భ‌రోసా ఇవ్వ‌టానికి కూడా దూరం చేస్తోంది. భ‌యం మ‌నిషిని మాన‌వ‌త్వాన్ని దూరం చేసి ఉన్మాదిగా మారుస్తుంది.

బ‌తికుండ‌గా ఆద‌రించ‌లేదు..
లాక్‌డౌన్ నేప‌ధ్యంలో మ‌న ఉనికిరాని క‌న్నీటి క‌థ‌లెన్నో ఉన్నాయి. క‌రోనా మాన‌వ జీవితాల‌ను చిన్నాభిన్నం చేస్తోంది. ప‌ట్ట‌ణంలోని చిరుపీరుసాహెబ్ వీధిలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న మాన‌వ‌త్వానికి మ‌చ్చ‌గా మిగులు తుంది. ఈ వీధిలో గ‌త కొన్ని రోజుల కింద‌ట‌ ఒక మ‌హిళ‌కు క‌రోనా సోక‌టంతో అధికారులు ఈ ప్ర‌దేశాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించి ఎవ‌రూ బ‌య‌ట‌కు తిర‌గ‌రాద‌ని క‌ట్ట‌డి చేశారు. ఇదే వీధిలో నివాసం ఉండే మాబుల్‌బాష (62) ప్రైవేటు ఎల‌క్ట్రీష‌న్‌గా ప‌నిచేస్తూ జీవనాన్ని కొన‌సాగిస్తున్నాడు. బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి లేక‌పోవ‌టంతో సగ‌టు పేద‌వాడి జీవితం లాగే ఇత‌ని జీవ‌తం కొన‌సాగింది.

స‌మీపంగా ఉండే వారికి క‌రోనా సోకింద‌న్న భ‌యం ఇత‌న్ని వెంటాడింది. దీంతో పాటు ఇత‌నికి టీబీ ఉండ‌టంతో భ‌యం ఇంకా ఎక్కువైంది. మందులు కూడా స‌క్రంగా వాడ‌క‌పోవ‌టంతో మృత్య‌వుకు చేరువ‌య్యాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాష‌ను ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ శుక్ర‌వారం సాయంత్రం మృతి చెందాడు. ఇత‌నికి ఆసుప‌త్రిలో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగిటివ్ రిపోర్టు వ‌చ్చింది.

ఇదేనా మాన‌వ‌త్వం..
చ‌నిపోయిన వారిని అన్ని మ‌తాల్లోనూ దేవుడిగా భావిస్తారు. అతన్ని అంతిమ సంస్క‌ర్ణ‌లు చేసి సాద‌రంగా సాగ‌నంపుతారు. క‌రోనా భ‌యంతో అంతిమ‌సంస్క‌రాలు కూడా క‌ష్టంగా మారాయి. ముందుగా చిన‌పీరు సాహెబ్‌వీధికి తెద్దామంటే కంటైన్మెంట్ జోన్ వల్ల తెస్తే ఇబ్బంది ఉంటుందని అధికారులు చెప్పటంతో అక్క‌డి నుంచి సుభానీన‌గ‌ర్‌, జాకీర్‌హెస్సేన్ వీధికి తీసుకువెళ్లిగా స్థానికుల నుంచి అదే వ్య‌తిరేక‌త‌. చివ‌రకు ఛార్లెస్ కాన్వెంట్ స‌మీపంలో ఉన్న కుమారుడి ఇంటివ‌ద్ద‌కు తీసుకువెళ్లి అంతిమ సంస్క‌ర్ణానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మృత్యువు ఎప్పుడు ఎవ‌రైనా క‌బ‌లించ‌వ‌చ్చు. చావు ఒక్క క‌రోనాతో రాదు. ఇదే ప‌రిస్థితి మ‌న‌కు క‌ల‌గ‌వ‌చ్చు. అప్పుడు ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తామా..? బాధ‌ల్లో ఉన్న వ్య‌క్తికి ఓదార్పు, భ‌రోసా అవ‌స‌రం. మ‌నిషి పోయిన దుఖంలో ఉన్న‌వారికి ఇదేనా మ‌నందించే స‌హాయం. ఇదేనా.. మాన‌వ‌త్వం. ఒక్క‌సారి ఆలోచించండి..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: బతికుండగా ఆదరించలేదు చనిపోయాక కనికరించలేదు Rating: 5 Reviewed By: NEWS UPDATE