చిలకలూరిపేట: పట్టణంలో కొత్తగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే విడదల రజిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం చిలకలూరిపేట పట్టణంలోనే ఏకంగా 27,728 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. వారందరికీ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి అందజేస్తారని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తమ ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందన్నారు. మరో వెయ్యి సేవలను తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిందని, ఇకపై 2,059 వ్యాధులకు వైద్య సేవలు అందిస్తామని వివరించారు. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మనసున్న నాయకుడని తెలిపారు. కాబట్టే రూ.వెయ్యి ఖర్చు దాటే ప్రతి రోగాన్ని ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించారని వెల్లడించారు. ఇప్పటికే క్యాన్సర్ రోగులకు ప్రతి నెలా ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. క్యాన్సర్ రోగులకు పూర్తిగా వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 510 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ఈ ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతందని వెల్లడించారు. ప్రతి 350 ఇళ్లకు ఆశా వర్కర్‌ను అటాచ్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేసిన ఘనత తమ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలోను రోగులకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5వేలు ఆర్థిక సాయం అందుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే అవ్వాతాతలు, విద్యార్థులకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. అవసరమైనవారందరికీ ఉచితంగా కళ్ల జోళ్లు అందజేశామన్నారు. పుట్టుకతో చెవుడు, మూగ ఉన్న పిల్లలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. డయాలసిస్ రోగులకు రూ.10,000 పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. పక్షవాతం, తలసేమియా ఉంటే రూ.5వేలు పింఛన్ ఇస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులను జీతం రూ.8వేల నుంచి రూ.16వేలకు పెంచిన ఘనత తమకే దక్కుతుందని వెల్లడించారు. త్వరలోనే అదనంగా 1056 అంబులెన్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఇది ఒక్క వైఎస్ జగన్ వల్లనే సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు, మున్సిపాలిటీ ఇంజినీర్లు, సిబ్బంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తల్హాఖాన్,పార్టీ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,పార్టీ అధికార ప్రతినిది షేక్ దరియా వలి, ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి,బీసీ అధ్యక్షుడు గుంజి వీరాంజనేయులు,పార్టీ నాయకులు కొలిశెట్టి శ్రీనివాసరావు, బొల్లెద్దు చిన్న పాల్గొన్నారు.
June 9, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

