728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 6, 2020

మొన్న ఏనుగు.. నేడు ఆవు

బిలాస్‌పూర్‌: పేలుడు పదార్థాలు కలిగిన పండును తిని ఆ బాధతో ఏనుగు మరణించిన ఘటన మరువక ముందే హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈసారి ఆవు ఆ దారుణ పరిస్థితిని ఎదుర్కొంది. బిలాస్‌పూర్‌లోని జన్‌దుత ప్రాంతంలో ఓ గర్భంతో ఉన్న ఆవు దవడ పగిలిపోయి రక్తమోడుతూ వీధుల్లో తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

దీంతో ఆ ఆవు యజమాని గురుదయాళ్‌ సింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. తన ఇంటి పక్కన ఉండే నందలాల్‌ కావాలనే ఇలా చేశాడని ఆరోపించాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నందలాల్‌ తన ఇంటి నుంచి పరారయ్యాడు. 10రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆవు యజమాని గురుదయాళ్‌ ఫిర్యాదు మేరకు జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మొన్న ఏనుగు.. నేడు ఆవు Rating: 5 Reviewed By: NEWS UPDATE