728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 6, 2020

చైనా, భారత్‌లో అమెరికాను మించి కేసులు!

వాషింగ్టన్‌: చైనా, భారత్‌లో కరోనా వైరస్‌ నిర్ధారిత పరీక్షలు ఎక్కువగా చేసుకుంటే అమెరికా కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యేవని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడుతోందని పేర్కొన్నారు.  ఇప్పటి వరకు అమెరికా 2 కోట్ల పరీక్షలు చేసిందని వెల్లడించారు.

ప్రస్తుతం అమెరికాలో దాదాపు 19 లక్షల మందికి కరోనా వైరస్‌ సోకింది. 1,09,000 మందికి పైగా మృతిచెందారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 ప్రభావం ఎక్కువగా ఉన్న దేశంగా యూఎస్‌ నిలిచింది. ఇక భారత్‌లో 2,36,184, చైనాలో 84,177 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. భారత్‌ ఇప్పటి వరకు 40 లక్షల టెస్టులు చేయడం గమనార్హం.

‘నా ప్రజలకు నేనొక్కటే చెబుతున్నా. మనం ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కేసులు నమోదవుతాయి. అదే భారత్‌, చైనా, ఇతర దేశాల్లో ఎక్కువ పరీక్షలు చేస్తే కచ్చితంగా అక్కడ కూడా ఎక్కువ కేసులు నమోదవుతాయి’ అని ట్రంప్‌ అన్నారు.

అమెరికాలోని ప్యూరిటన్‌ కంపెనీ ర్యాపిడ్‌ టెస్టులకు అవసరమైన స్వాబ్‌లను ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి  చేస్తోంది. దానిని ఉద్దేశించే ట్రంప్‌ మాట్లాడారు. ‘టెస్టుల సామర్థ్యాన్ని పెంచినందుకు ధన్యవాదాలు. మన దేశం మళ్లీ తెరుచుకుంటోంది. ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. అమెరికా చరిత్రలోనే అత్యధిక ఉద్యోగాలు పెరిగిన నెలగా ఇది రికార్డు సృష్టించింది. ఎన్నికలకు ముందే మరిన్ని ఉద్యోగాలు వస్తాయి’ అని ట్రంప్‌ వెల్లడించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చైనా, భారత్‌లో అమెరికాను మించి కేసులు! Rating: 5 Reviewed By: NEWS UPDATE