అమరావతి: కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులతో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం సడలింపులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 8 తేదీ నుంచి మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మార్గదర్శకాలు ఇవే..
🔹కంటైన్‌మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి. ఆహారం పార్శిల్ తీసుకువెళ్లేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
🔹65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్లలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు.
🔹కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలనూ అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలి.
🔹షాపింగ్ మాల్స్‌లో ఎయిర్ కండీషన్ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండాలి.
🔹బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.
🔹అనుమతి ఉన్న షాంపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు డిజిటల్ చెల్లింపులు, ఈ-వ్యాలెట్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
🔹షాపింగ్ మాల్స్ ప్రాంగణాలు, పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలి.
🔹ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం.
🔹హోటళ్లు, రెస్టారెంట్లలోని టేబుళ్లు, కుర్చీలు వినియోగదారుడు మారిన ప్రతీసారీ శానిటైజ్ చేయాలి.
🔹గేమింగ్ ప్రాంతాలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ మూసి ఉంచాలి.
🔹షాపింగ్ మాల్స్లోని సినిమా హాళ్లు తెరవకూడదు.
దేవాలయాల్లో పాటించాల్సినవి..
🔹దేవాలయాలు, ధార్మిక ప్రదేశాలకు అనుమతి.
🔹ధార్మిక ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంపై కొనసాగనున్న నిషేధం.
🔹దేవాలయాల వద్ద క్యూ మేనేజ్‌మెంట్ సవ్యంగా ఉండాలి.
🔹దేవాలయాల్లో విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను ముట్టుకోకుండా దర్శనం చేసుకోవాలి.
🔹తీర్థ ప్రసాదాలు ఇవ్వడం, పవిత్ర జలాలను భక్తులపై చల్లడం నిషేధం.
🔹సరైన భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.
🔹ప్రార్థనా మందిరాల్లో ఎవరికి వారు కిందకూర్చునే వస్త్రం లేదా తివాచీని తెచ్చుకోవాలి.